ఉప్పు వాడకం తగ్గిస్తే..

లండన్‌, నవంబరు 18: రోజువారీ ఉప్పు వినియోగాన్ని తగ్గిస్తే హృద్రోగాలతో పాటు కిడ్నీ వ్యాధుల బారిన పడే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది. మూత్రం ద్వారా వివిధ ప్రొటీన్లు శరీరంలో నుంచి బయటికి వెళతాయని, ఇందులో అల్బుమిన్‌తో సహా అల్బుమినురియా అనే ప్రొటీన్‌ స్థాయులు ఎక్కువగా ఉండడం దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి(సీకేడీ)కి సంకేతమని శాస్త్రవేత్తలు తెలిపారు. చెప్పారు. ఈ అల్బుమినురియా విసర్జనను సమర్థంగా నిరోధించడానికి లాంటి చికిత్స అందుబాటులో లేదని యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌ గ్రోనింజెన్‌ పరిశోధకుడు మార్టిన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఉప్పు వినియోగం తగ్గించి, పారికాల్సిటోల్‌ వినియోగిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని వెల్లడైందని వివరించారు.