మాంసాహారంతో కాలేయానికి ముప్పు?

లండన్‌, ఏప్రిల్‌ 23: మాంసాహారం తింటే కాలేయ వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మాంసంతో శరీరంలోకి చేరిన కొవ్వు కాలేయంలో పేరుకుపోతుందని, జంతు మాసంలో ఉండే ఓ రకమైన ప్రొటీన్‌ దీనికి కారణమని తెలిపారు. ఇలా పేరుకుపోయిన కొవ్వు హృద్రోగ వ్యాధులకు, కేన్సర్‌కు దారితీస్తాయని అన్నారు. నాన్‌ ఆల్కాహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌(ఎన్‌ఏఎ్‌ఫఎల్‌డీ)పై నెదర్లాండ్స్‌కు చెందిన ఎరా్‌సమస్‌ మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కాలేయానికి దీర్ఘకాలిక నష్టం కలిగించడంతో పాటు లివర్‌ సిర్రోసి్‌సకు దారితీస్తుందని, కాలేయ పనితీరును దెబ్బతీస్తుందని వివరించారు.