ఇవి తింటే... మామా ఏక్ పెగ్ లా అని అనేయొచ్చట

26-10-2017:మామా ఏక్ పెగ్ లా అనాలంటే భయపడుతున్నారా?.. లివర్ పాడవుతుందని టెన్షన్ పడుతున్నారా?..అయితే ఎలాంటి ఆందోళనా అవసరం లేదంటున్నాయి పరిశోధనలు. పెగ్గు మందుకు పెరటి మందు ఉందని చెబుతున్నాయి.

మామా ఏక్ పెగ్ లా అనేయొచ్చు... లివర్ గురించి ఫియర్ అక్కర్లేదు. అవును.. మీకు సరదాగా డ్రింక్ చేసే అలవాటు ఉంటే మామా ఏక్ పెగ్ లా అని చీర్స్ చెప్పొచ్చు. మందెక్కువైతే లివర్ డామేజ్ అవుతుంది కదా అంటారా.. ఆ భయం అవసరం లేదంటున్నాయి తాజా పరిశోధనలు. పెగ్గు మందుకు పెరట్లోనే మందు ఉందని చెబుతున్నాయి. గ్రీన్ చిల్లీస్‌ను పక్కన పెట్టుకుంటే చిల్ అయినా పర్వాలేదంటున్నాయి.
 
ఆఫ్రికన్ ట్రైబుల్స్‌పై పరిశోధనలు... గ్రీన్ చిల్లీస్‌తో చిల్ అయ్యే ఆఫ్రికన్స్. ఆఫ్రికన్ ట్రైబుల్స్‌పై చేసిన పరిశోధనలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అక్కడ ఎక్కువగా మందులో మంచింగ్‌గా గ్రీన్ చిల్లీస్‌నే వాడతారు. వారికి ఎలాంటి లివర్ ప్రాబ్లమ్స్ రావడం లేదని పరిశోధనలు తేల్చేశాయి. పెగ్‌తో పాటు పచ్చిమిర్చిని తీసుకుంటున్న వారికి లివర్ డ్యామేజ్ కావడం లేదని తేల్చారు. గ్రీన్ చిల్లీస్ తీసుకోని వారిలో మాత్రం లివర్ డ్యామేజ్ కనిపిస్తోందంటున్నారు.
 
మనదేశీయ పశ్చిమిర్చిలో కూడా ఆరోగ్యానికి సహకరించే రసాయనాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విశాఖ ఆంధ్రా వర్సిటీ, సంయుక్తంగా కొన్ని పరిశోధనలు చేశాయి. ఈ పరిశోధనలో దేశీయ పచ్చిమిర్చిలో ఉన్న పవరేంటో తేలింది. గ్రీన్ చిల్లీస్‌లో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని పరిశోధనలో తేల్చారు. లివర్ డ్యామేజ్‌ను కంట్రోల్ చేసే పవర్ గ్రీన్ చిల్లీస్‌కే ఉందట. తాగడం ద్వారా లివర్‌కు జరిగే నష్టాన్ని పచ్చిమిర్చి బ్యాలెన్స్ చేస్తుందని ఫైనల్‌గా తేల్చారు. పెగ్గేయడం   ద్వారా జరిగే అనేక నష్టాలు పచ్చిమిర్చి కవర్ చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.  చర్మం మీద వచ్చే ముడతలను కూడా నివారిస్తుందట. ఎక్కువగా డ్రింక్ చేసే వారిలో హైపర్ టెన్షన్ సమస్య ఉంటుంది. అయితే పచ్చిమిర్చికి హైపర్ టెన్షన్‌ను తగ్గించే పవర్ కూడా ఉందట. అతిగా తాగడం వల్ల టైప్2 డయాబెటిస్ డెవలప్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అయితే గ్రీన్ చిల్లీస్‌కు డయాబెటిస్‌ను తగ్గించే పవర్‌ కూడా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే పెగ్గేసే ముందు పచ్చిమిర్చిని మాత్రం మర్చిపోవద్దని గట్టిగా చెబుతున్నారు.
 
అయితే గ్రీన్ చిల్లీస్‌ను ఎక్కువగా ఉడికించడం వల్ల మాత్రం ఉపయోగం ఉండదంటున్నారు. చికెన్‌లోనో, మటన్‌లోనో బాగా ఉడికించి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. అలా చేస్తే పెగ్గు పవర్‌ను గ్రీన్ చిల్లీస్ తగ్గించలేదంటున్నారు. వెజిటెబుల్స్ సలాడ్స్‌లో వేయించిన పచ్చిమిర్చిని తీసుకుంటే ఓ రెండు పెగ్గులు ఎక్కవేసినా నష్టం జరగదంటున్నారు. తాగడం వల్ల జరిగే నష్టాన్ని బ్యాలెన్స్ చేయడంలో పచ్చిమిర్చి పవరే వేరంటున్నారు. ఎక్కువగా ఉడికించడం వల్ల పశ్చిమిర్చి దాని క్వాలిటీస్‌ను కోల్పోతుందని హెచ్చరిస్తున్నారు. ఫ్రై చేసుకుని సలాడ్స్‌లో తీసుకోవడం వల్లే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. పెగ్గు తీసుకుంటే వచ్చే అనేక అనారోగ్య సమస్యల్ని గ్రీన్ చిల్లీస్ కవర్ చేస్తుందంటున్నారు. మామా ఏక్ పెగ్ లా అనే ముందు గ్రీన్ చిల్లీస్‌ను గుర్తు తెచ్చుకొమ్మని పరిశోధనలు చెబుతున్నాయి.