ఒకే వ్యక్తికి 3సార్లు కిడ్నీ మార్పిడి

గైనీగల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రి వైద్యుల ఘనత
 
హైదరాబాద్‌ సిటీ, మార్చి 7:దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా గ్లెనీగల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రి వైద్యులు ఓ వ్యక్తికి మూడుసార్లు కిడ్నీ మార్పిడి చేశారు. నాలుగేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాధారణ జీవితం గడుపుతున్నాడని వైద్యులు వివరించారు. సోమవారం ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ రవీంద్రనాథ్‌, వైద్యులు ఈ వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన సురీందర్‌కుమార్‌ సాహూ (52)కు గడిచిన 22 ఏళ్లలో మూడుసార్లు కిడ్నీ మార్పిడి చేసినట్లు చెప్పారు. మొదటిసారి 1991లో కిడ్నీ మార్పిడి చేశారు. నాలుగేళ్ల తరువాత అది సహకరించకపోవడంతో 1995లో మరోసారి మార్చారు. ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతున్న ఆయన జీవితంలో 2013లో మళ్లీ మూత్రపిండాల సమస్య వచ్చింది. దీంతో అదే ఏడాది ఆయనకు మరోసారి కిడ్నీ మార్చినట్లు వైద్యులు తెలిపారు.