కీళ్లనొప్పుల నివారణలో ఆధునిక హోమియో వైద్యం

14-06-2017:నేటి నాగరిక జీవనం కీళ్లపైన మరింత ఒత్తిడి తీసుకువస్తున్నది. ఎక్కువ సమయం కూర్చోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం వంటి కారణాలు, పరోక్షంగా కీళ్లనొప్పులకు దోహదం చేస్తున్నాయి. వంశపారంపర్య కారణాల వల్ల కూడా ఈ సమస్యలు చుట్టుముట్టే అవకాశం లేకపోలేదు. శరీర రక్షణవ్యవస్థకు సంబంధిచిన లోపాలు, సమస్యలు కూడా కీళ్లజబ్బులను తీవ్రం చేస్తాయి. వీటన్నింటికీ తోడు కొన్ని రకాల వ్యాధులు కూడా ఈ సమస్యకు దారి తీస్తాయి. ప్రమాధాల్లో గాయపడటం, కీళ్లను అవసరానికి మించి ఉపయోగించడం వంటివి కూడా కీళ్లనొప్పులకు మూలమవుతాయి.

 
నడవడమే కష్టమా? ఎందుకని?
కీళ్లల్లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు మోకాళ్లు లేదా ఇతర కీళ్లభాగాల్లో విపరీతమైన నొప్పి, వాపు, బిగుసుకుపోవడం, నడవడంలో ఇబ్బంది వంటివి బాఽధిస్తాయి. మెల్లమెల్లగా కీళ్లు వాటి రూపాన్ని కోల్పోవడంతో కాలు ఆకృతిలో నిర్మాణంలో కూడా తేడా కనిపిస్తుంది. దీనికి వెనువెంటనే చికిత్స తీసుకోకపోతే, అంగవైకల్యం ఏర్కడే అవకాశం ఉంది. కీళ్ల అరుగుదల బాగా ఎక్కువైపోయిన తర్వాత కీళ్ల కదలిక కూడా తగ్గిపోతుంది. కండరాలు పటుత్వం కోల్పోయు, ఆ వ్యవస్థలోనే అసమానతలు ఏర్పడతాయి. కొన్ని రకాల చిన్న చిన్న పనులు కూడా చేయలేని స్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా కూర్చుని లేవడం, మెట్లు ఎక్కడం, దిగడం, వంటి పనులు చాలా ఇబ్బందికరంగా మారతాయి. చివరికి టాయిలెట్‌కు వెళ్లడం కూడా నరకంగా ఉంటుంది.
 
కీళ్లల్లో నొప్పి, వాపు ఎందుకు?
కీళ్లు అతుక్కునే భాగాన్ని ఆర్టిక్యులార్‌ కార్టిలేజ్‌ అంటారు. కీళ్ల సమస్యకు సంబంధించి అన్నింటికన్నా ముందు ఈ కార్టిలేజ్‌ నుంచే మార్పులు మొదలవుతాయి. ఏ కారణాల వల్ల కీళ్లు ప్రభావితం అయినా, ఈ కార్టిలేజ్‌ పలచబడి, సాగి ముడతలు పడుతుంది. కీళ్ల భాగంలో పొలుసుల్లాంటివి ఏర్పడతాయి. ఫలితంగా కీళ్ల కదలికలకు అంతరాయం ఏర్పడుతుంది. దీని వల్ల పక్కభాగంలోని రక్తనాళాలు ఉబ్బి కార్టిలేజ్‌కు రక్తసరఫరా అదికమవుతుంది. ఈ క్రమంలో కీళ్ల మధ్యబొడిపెల్లాంటి ఆస్టియోఫైట్స్‌ ఏర్పడతాయి. సాధారణంగా ప్రతి 40 రోజులకు పాత ఎముక కణాలు చనిపోయి కొత్తవి పుడుతుంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్‌ సమస్య ఉన్నప్పుడు మాత్రం ఈ కణాలు ఎముక అరిగిన చోట కాకుండా, వేరే చోట ఏర్పడతాయి. త ద్వారా ఈ ఆస్టియోఫైట్స్‌ కీళ్లను రాపిడికి గురిచేస్తాయి. దీనివల్ల కీళ్లు గట్టిపడటం, వాపు మొదలైనవి కలుగుతాయి. కీళ్ల లోపలి ద్రవం సన్నటి రంద్రాల ద్వారా ఎముకల మధ్యలోకి వెళ్లి గడ్డలుగా తయారవుతాయి. ఈ కారణంగా ఎముకల్లోని ట్రాబిక్యులే అనే భాగానికి నష్టం కలుగుతుంది. క్రమంగా కీళ్లలోని జిగురు పదార్థం తగ్గడం వల్ల కీళ్లు గట్టిగా మారి కద లికల్లోని ఇబ్బంది ఎక్కువ అవుతుంది.
 
ఆపరేషన్‌ లే కుండా హోమియోతోనే నయం
హోమియో చికిత్స కన్నా ముందు కీళ్ల నొప్పుల బాధితులకు కొన్ని పరీక్షలు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా రక్తపరీక్షలు, ఎక్స్‌రే, ఎం. ఆర్‌. ఐ స్కానింగ్‌ల ద్వారా ఏ కారణంగా కీళ్లు దెబ్బతిన్నాయి? వ్యాధి ఏరకమైనది అన్న విషయాన్ని గుర్తించవచ్చు. చాలా సందర్భాల్లో కీళ్ల నొప్పులు (ఆస్టియో ఆర్థరైటిస్‌) తగ్గాలంటే కీళ్ల మార్పిడి చికిత్స తప్ప మరో మార్గమే లేదనే మాటే వినపడుతుంది. కానీ, ఆపరేషన్‌ లేకుండానే జబ్బును తగ్గించగల మందులను హోమియో అందుబాటులోకి తెచ్చింది. ఆధునిక హోమియో మందులు ఇన్‌ఫెక్షన్లను, టాక్సిన్లను బయటికి పంపడం ద్వారా నొప్పి తగ్గిస్తాయి. దెబ్బతిన్న భాగానికి సవ్యంగా రక్త సరఫరా అయ్యేలా చేసి, గాయం త్వరగా మానేందుకు తోడ్పడతాయి. దీనికి తోడు కండరాలను బలోపేతం చేస్తాయి. నొప్పిని, వాపును తగ్గించడంలో తోడ్పడతాయి. ఏమైనా ఆస్టియో ఆర్థరైటిస్‌ సమస్యకు తొలిదశలోనే చికిత్స ప్రారంభిస్తే, దెబ్బతిన్న కార్టిలేజ్‌ను పునరుద్దరించగల అవకాశాలు హోమియో వైద్యంలో మెండుగా ఉంటాయి. ఒకవేళ సమస్యను నిర్లక్ష్యం చేస్తే, ఆపరేషన్‌ తప్పని స్థితి ఏర్పడుతుంది. ఆపరే షన్‌ తో సమస్య శాశ్వతంగా పరిష్క రించే అవకాశం ఎలాగూ లేదు కాబట్టి శాశ్వత చికిత్సను అందించే హోమియో వైద్యుణ్ని సంప్రదించడం ఎంతో వివేకవంతమైనపని.
 
డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి, ఎం.డి.
హోమియో, స్టార్‌ హోమియోతి,
ఫోన్‌- 8977 336677,
టోల్‌ఫ్రీ :1800-108-5566
www.starhomeo.com
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, దుబాయ్‌, లండన్‌, మాంచెస్టర్‌