హార్మోన్‌ సమస్యలకు సరైన పరిష్కారం

10-08-2017: ఈ మధ్యకాలంలో హైపోథైరాయిడ్‌, పీసీఓడీ, సంతానలేమి, డయాబెటిస్‌ వంటి దీర్ఘకాలిక జబ్బుల గురించి వింటున్నాము. ఇవన్నీ హార్మోన్‌ అసమతుల్యతల వలన వచ్చే జబ్బులే. ఇంకా చాలా హార్మోన్‌లు మానవ శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. వాటిలో ముఖ్యమైన హార్మోన్‌ సమస్యల గురించి చర్చించుకుందాం.

 
హార్మోన్లు పాలీపెస్టైడ్‌తో నిర్మితమైన రసాయనవాహకాలు, ఇవి శరీరంలో ఒక ప్రాంత కణజాలం, అవయవాల నుంచి ఉత్పత్తి అయి, వివిధ శరీర భాగాలకు రక్తం ద్వారా ప్రవహించి నిర్ధిష్ట అవయవాన్ని ప్రభావితం చేసి జీవప్రక్రియల సమతుల్యతకు తోడ్పడుతాయి. ఇవి మానవ శరీరంలో సూక్ష్మ మోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ, వీటి ప్రభావం వలన శరీరంలోని వివిధ సాధారణ జీవనక్రియలైన జీర్ణక్రియ శారీరక, మానసిక ఎదుగుదల ప్రత్యుత్పత్తి, మానసిక సమతుల్యత, జీవక్రియలకు తోడ్పడతాయి. మానవుడిలో ఈ హార్మోన్‌లు అసమతుల్యతకు గురి అయినప్పుడు తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతాడు.
 
హైపోథైరాయిడ్‌ లక్షణాలు: బరువు పెరగడం జుట్టురాలడం, నీరసం, మతిమరుపు, ఋతుచక్ర సమస్యలు మొదలైన వాటికి దారితీస్తుంది.
హైపర్‌థైరాయిడ్‌ లక్షణాలు: బరువు తగ్గడం, నీరసం, గుండెదడ, కాళ్లు చేతులు వణకడం మొదలైన సమస్యలకు దారి తీస్తుంది.
గాయిటర్‌: గొంతుకింద ఉండే థైరాయిడ్‌ గ్రంధి వాపునకు గురి అవటాన్ని గాయిటర్‌ అంటాం. ఇది ముఖ్యంగా అయోడిన్‌ లోపం వలన వస్తుంది. ఇది హైపో, హైపర్‌ థైరాయిడ్‌ సమస్యలతో కూడుకుని ఉండవచ్చు.
స్ర్తీలలో ఉండే హార్మోన్‌లు: ఈస్ర్టోజెన్‌, ప్రొజెస్టిరాన్‌, ప్రొలాక్టిన్‌, ఆక్సిటాసిన్‌ హార్మోన్‌లు స్ర్తీలలో రజస్వల, ఋతుచక్రం, ద్వితీయ లైంగిక లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవంలో ఉపకరిస్తాయి. ఈ హార్మోన్‌లు అసమతుల్యతల వలన స్త్రీలలో ఋతుచక్ర సమస్యలు హిర్సుటిజం(అవాంఛిత రోమాలు) మరియు సంతానలేమి సమస్యలు వస్తాయి. స్ర్తీలలో మెనోపాజ్‌, రజస్వల అయ్యే సమయంలో హార్మోన్‌ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మెనోపాజ్‌లో హార్మోన్‌ హెచ్చుతగ్గుల వలన మానసిక అశాంతి, నీరసం, కీళ్ళు, కండరాల నొప్పులు వస్తాయి.
టెస్టోస్టిరాన్‌: ఇది పురుషులలో ఉండే హార్మోన్‌. దీని అసమతుల్యతల వలన శీఘ్రస్కలనం, అంగస్తంభన సమస్యలు, శుక్రకణ సమస్యలు, సంతానలేమి సమస్యలు వస్తాయి.
హోమియోకేర్‌ వైద్యం: హార్మోన్‌ సమస్యలు ఒక దానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. వీటికి హోమియో కేర్‌ వైద్యంతో ఎలాంటి హార్మోన్‌లు బయటినుంచి ఇవ్వకుండా హార్మోన్‌ అసమతుల్యతలను సరిచేయడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఋతుచక్ర సమస్యలు, పీసీఓడీ సమస్యలు. సంతానలేమి, శుక్రకణ సమస్యలను సంపూర్ణంగా నయం చేయవచ్చును.
డయాబెటిస్‌ ఇన్‌సెపిడిస్ : ఇది ఎడిహెచ్‌(యాంటీ డైయూరెటిక్‌ హార్మోన్‌) లోపం వలన వస్తుంది. దీనిని అతి మూత్ర వ్యాధి అంటారు.
డయబెటిస్‌ మెల్లిటస్‌: ఇది క్లోమ గ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ లోపం వలన లేదా తక్కువ మోతాదులో ఉత్పత్తి కావడం వలన వస్తుంది. ఇది రెండు రకాలు
టైప్‌1 డయాబెటిస్‌: ఇది ఇన్సులిన్‌ ఉత్పత్తి కాకపోవడం వలన వస్తుంది. దీనిని జువైనల్‌ డయాబెటిస్‌ మిల్లిటస్‌ అని అంటారు. ఈ వ్యాధి ఉన్న వారు పూర్తిగా ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌లపై ఆధారపడవలసి వస్తుంది.
టైప్‌2 డయాబెటిస్‌: ఇది ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గటం వలన వస్తుంది. ఇది ఎక్కువగా 30సంవత్సరాలు పైబడిన వారిలో వచ్చే అవకాశం ఉంటుంది. కానీ. ఈ మధ్యకాలంలో యుక్త వయస్తులో ఉన్న వారికి కూడా వస్తోంది.
డయాబెటిస్‌తో బాధపడే వారి రక్తంలోని చక్కెర శాతాన్ని సరిగ్గా నియంత్రణ చేయకపోవడం వలన దీర్థకాలంలో డయాబెటిస్‌ నెఫ్రోపతి, డయాబెటిక్‌ న్యూరోపతి, రెటినోపతి, గుండె సమస్యలు, అంగస్తంభన సమస్యలు లాంటి చాలా కాంప్లికేషన్స్‌ వస్తాయి.
డయాబెటిస్ కి హోమియోకేర్‌లో పరిష్కారం: డయాబెటిస్ ను తొందరగా గుర్తించి, తొలిదశలో హోమియోకేర్‌ ప్రత్యేక హార్మోన్‌ సెల్‌ మరియు కాన్‌స్టిట్యూషనల్‌ విధానం ద్వారా సంపూర్ణంగా నయం చేసే అవకాశం ఉంది. హోమియోపతి చికిత్స ద్వారా దీర్థకాలికంగా డయాబెటిస్తో బాధపడే వారికి ఎలాంటి దుష్పలితాలు లేకుండా వ్యాధిని అదుపులో ఉంచటమే కాకుండా కాంప్లికేషన్స్‌ను నివారించవచ్చు.
కార్టికోస్టిరాయిడ్స్‌: ఇవి అడ్రినల్‌ గ్రంథి నుంచి విడుదల అవుతాయి. ఇవి అన్ని ముఖ్యమైన జీవనక్రియల్లో, రోగ నిరోధక వ్యవస్థల్లో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. దీని అసమతుల్యత వలన కుషింగ్స్‌ మరియు అడిసన్స్‌ వ్యాధులు వస్తాయి.
 
 
 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌ ఇకఈ
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
టోల్‌ ఫ్రీ : 1800 108 1212
ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక,
తమిళనాడు, పాండిచ్చేరి