హోమియోలో వెరికోస్‌ వీన్స్‌ నివారణ !

20-12-2017: డాక్టర్‌ గారు నా పేరు రమాదేవి. వయసు 45 సంవత్సరాలు. ఎక్కడా పది నిమిషాలు నిలుచోలేకపోతున్నాను. కాళ్లు లాగుతున్నాయి. పాదాలు, నరాలు ఉబ్బి... పాదాలు నలుపు రంగుకు మారుతున్నాయి. హోమియోలో దీనికి పరిష్కార మార్గాలు చెప్పండి?

 
ఇటీవల కాలంలో రోజురోజుకు వెరికోస్‌ వీన్స్‌ వ్యాధి బాధితులు పెరగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. శరీరంలోని సిరలు బలహీనపడడం వల్ల ఏర్పడే సమస్యనే వెరికోస్‌ వీన్స్‌ అంటారు. అంటే శరీరంలోని రక్తనాళాల రంగులు మారుతాయి. లేదా రక్తనాళాలు నలుపు రంగులోకి మారడాన్ని వెరికోస్‌ వీన్స్‌గా పరిగణిస్తారని తెలిపారు. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో సంభవిస్తోంది. ముఖ్యంగా మారుతున్న జీవన విధానం, అవగాహనలేమితోనే ఈ వ్యాధి సమస్య తీవ్రరూపం దాల్చి ఇతర సమస్యలకు దారితీస్తోందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా రక్తం కింది నుంచి పైకి అంటే గుండెవైపునకు సరఫరా జరుగుతుంది. కానీ కాళ్లపై ఒత్తిడి వల్ల రక్తప్రసరణ మందగించటం, వ్యతిరేకదిశలో రక్త సరఫరా కావడంతో రక్తనాళాలు (సిరలు)వాపునకు గురవుతాయి. ఈ క్రమంలో అవి నలుపు లేదా ఉదారంగుకు మారుతతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడి నడవడానికి కూడా వీలుకాదు. ఈ వెరికోస్‌వీన్‌ వ్యాధి శరీరంలోని ఇతర భాగాల్లో కూడా వస్తుంది. కానీ 80 శాతం మందిలో కాళ్లలోనే వస్తుంది.
సాధారణంగా 30 ఏళ్లు, ఆపై వయసు ఉన్నవారికి ఈ వెరికోస్‌వీన్‌ వ్యాధి వస్తుంది. దేశంలో 30 శాతం మంది ఈ రకమైన వ్యాధితో బాధపడుతున్నారు. స్త్రీలలో, స్థూల కాయుల్లో, వ్యాయామం చేయని వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
 
కారణాలు
రక్తనాళాల లోపల కవాటంలో గల ఇబ్బందులు, రక్తం మళ్లీ వెనకకు రావటం వల్ల సంభవించును.
కొంతమంది స్త్రీలలో గర ్భధారణ సమయంలో హర్మోన్లలో మార్పులు రావడం ఒక ప్రధాన కారణం.
ఎక్కువ సేపు నిలబడి ఉద్యోగం చేసేవారిలో ఈ వ్యాధి రావచ్చు.

పోలీసు, ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌, సెక్యూరిటీ కండక్టరు, వాచ్‌మెన్‌, సేల్స్‌మెన్‌, టీచర్లకు ఎక్కువగా రావటానికి ఆస్కారముంది.

లక్షణాలు
కాళ్లల్లో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం
ఫ ఉండడం
చర్మం దళసరి కావటం, దురద, ఎరుపురంగు మారటం
చర్మం ఉబ్బటం, పుండ్లు పడటంనాళం లోపల ర క్తం గడ్డకట్టడం, ఎక్కువసేపు నడవలేకపోవడం

వ్యాధి నిర్థారణ

అల్ట్రాసౌండ్, డూప్లెక్స్‌ డాప్లర్‌ అలా్ట్రసౌండ్‌ పరీక్షలు
హోమియోపతి చికిత్స
హోమియోపతి విధానంలో పరిశోధన, చికిత్సలో అనుభవం ఉన్న వైద్యులు వెరికోస్‌ వీన్స్‌, వెరికోస్‌ వంటి వ్యాధులన్నీంటికి చికిత్స చేస్తారు. ఆపరేషన్‌ లేకుండా వ్యాధి తీవ్రతను పరిశీలించి, వ ్యక్తిగత లక్షణాలను అనుసరించి మంచి మందులు వైద్యులు సూచిస్తారు. వెరికోస్‌ వీన్స్‌కు హోమియోపతిలో హమామెలిస్‌, పల్సేసటిల్లా, కాలేకేరియా, గ్రాఫైట్స్‌, కార్బోవెజ్‌ తిర్నేనికా మొదలగు మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని డాక్టర్‌ పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి, ఎం.డి. హోమియో
స్టార్‌ హోమియో, ఫోన్‌- 8977 336677,టోల్‌ఫ్రీ :1800-108-5566
 www.starhomeo.com
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, దుబాయ్‌, లండన్‌, మాంచెస్టర్‌