వెన్నునొప్పికి హోమియోలో అద్భుత చికిత్స!

27-12-2017: వెన్నునొప్పి సాధారణ సమస్యగా మారింది. చాలామంది నడుము, మెడ నొప్పితో బాధపడుతున్నారు. కారణాలేమిటి?

మన శరీరంలో వెన్నెముక నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. వెన్నుభాగంలో లింగమెంట్లు, కండరాలు, పేసట్‌ జాయింట్‌లు అనుసంధానమై శరీరానికి స్థిరత్వాన్నిస్తాయి. దైనందిక జీవితంలో శారీరకంగా ఎదురయ్యే ఎన్నో ఒత్తిడిలను తట్టుకొని నరాల మీద ఏ విధమైన ఒత్తిడి పడకుండా కాపాడడం ఈ వెన్నెముక ప్రధాన లక్షణం.
 
వెన్నునొప్పికి కారణాలు: వెన్నెముక భాగాల మీద ఒత్తిడి పెరగటం, దెబ్బ తగలటం, అధిక బరువులు ఎత్తడం, దించటం, ఊబకాయం, ఇన్‌ఫెక్షన్లు, కాల్షియం, విటమిన్‌ బి12లోపాలు, ఎముకల సాంద్రత తగ్గటం. మెడ, నడుము ఏ పని చెయ్యాలన్నా వీటి అవసరం తప్పనిసరి. ప్రతి పదిమందిలో ఆరు నుంచి ఎనిమిది మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ వెన్నునొప్పి వల్ల తమ వృత్తి, ఉద్యోగాలను మార్చుకుంటున్నారు. సర్జరీకి, మందులకు, పిజియోథెరపీకి 70 నుంచి 100 మిలియన్‌ డాలర్ల వరకు ఖర్చుపెడుతున్నారని అంచనా.
 
ఈ వెన్నునొప్పి దీర్ఘకాలికంగా బాధిస్తూ ఉంటే సర్జరీ అవసరమని చెప్తూ ఉంటారు. మరి హోమియోపతి మందుల ద్వారా దీన్ని నయం చేయవచ్చా?
ఈ నొప్పులతో నిరాశ చెందేవారికి హోమియోపతి అద్భుతమైన చికిత్స. ఈ వెన్నునొప్పికి కారణమైన డిస్క్‌బెల్ట్‌, డిస్క్‌ కంప్రెషన్‌, నరాలను ఒత్తిడికి గురిచేయటంతో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. హోమియోపతి మందులు వ్యాధిమూలకారణమైన డిస్క్‌బెల్జ్‌ నరాల వత్తిడిలను తగ్గించే చాలా రకాల మందులున్నాయి.
 
దీర్ఘకాలికంగా కదలకుండా కూర్చొనే సాప్ట్‌వేర్‌ ఇంజనీర్లు, క్లర్కులు ఇంకా ఇతర ఉద్యోగాల్లో ఉన్నవారికి, ఊబకాయంతో ఉన్నవారికి, ఉబకాయంతో పాటు నడుము నొప్పితో బాధపడేవారికి కోబాల్ట్‌ అనే మందు బాగా పనిచేస్తుంది. దెబ్బలు తగలటం, డిస్క్‌బెల్ట్‌ ప్రమాదాల్లో వెన్నెముక చిట్లడం, వెన్నుపాముకు దెబ్బతగలడం లాంటి సమస్యలు ఆపరేషన్‌కు దారితీస్తాయి. సింఫైటమ్‌, ఆర్నిక, హైపరికం, బెల్లిస్‌, పెర్నిస్‌, అగాలికస్‌ మందులు మూడు శతాబ్దాలుగా ఎందరికో ఏ విధమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా ఆపరేషన్‌ అవసరం లేకుండా నయం చేస్తున్నాయి.
 
సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అంటే ఏమిటి? హోమియోపతిలో చికిత్స ఉందా?
సర్వైకల్‌ స్పాండిలోసిస్‌.. ఇది మెడలోని సీ1,సీ2, సీ3, సీ4, సీ5, సీ6, సీ7 వెన్నుపూసల అనుసంధానమైన భాగాన్ని సర్వైకల్‌ ప్రాంతం అంటారు. ఈ మెడ ప్రాంతంలోని వెన్నుపూస కీళ్లలో మధ్యలోని ఖాళీ భాగం తగ్గిపోవడం డిస్క్‌బల్జ్‌ కావడం, వెన్నుపూస మధ్యలో రాపిడి ఎక్కువవడం, ఆస్టియోఫైట్స్‌ చేరడం వలన మెడ నుంచి చేతికి... చేతివేళ్లకు నొప్పి వ్యాపిస్తుంది.
 
తిమ్మిర్లు, చే యి మొద్దుబారడం, మెడపట్టివేయడం, తల తిరగడం, ఒక్కోసారి వాంతి వచ్చినట్టు ఉంటుంది. ఈ ఆధునిక యుగంలో నగరజీవితంగడిపే ప్రతి పదిమందిలో ఐదుగురు ఈ సర్వైకల్‌ స్పాండిలోసిస్ తో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి హోమియో చికిత్సా విధానం ఓవరం. ముఖ్యంగా యాసిడ్‌ఫాస్‌ అనే మందు ఏ రకమైన సర్వైకల్‌ స్పాండిలోసిస్కైనా పనిచేస్తుంది. కాల్మియ లాటి ఫోలియా అనే మందు మెడ భాగం నుంచి భుజం చేయి, చేతివేళ్లకు నొప్పి వ్యాపిస్తుంది. విపరీతంగా తిమ్మిరి పడుతుంది.
 
కల్‌కేరియా ఫాస్‌ మందు కాల్షియమ్‌ తక్కువ కావడం, విటమిన్‌ బీ3, బీ 12 సమస్యలు మరియు ఆస్టియోఫైట్స్‌ ఉండి మెడభారంగా ఉంటుంది. వయసుతో వచ్చే వెన్నుపూస మార్పులకు ఈ మందు అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా బయోనియా, స్పైజిలియా, రష్టాక్స్‌, జెల్సినియమ్‌ మందులను డాక్టర్‌ పర్యవేక్షణలో వాడాలి.
 
డాక్టర్‌ గారూ.. వెన్ను నొప్పులకు నొప్పి నివారణ మాత్రలు జీవితాంతం వాడాల్సిందేనా?
మెడ, నడుము నొప్పి సమస్యలు ఉద్యోగాలకు ఆటంకం కలిగిస్తాయి. ఈ వెన్నునొప్పి వల్ల పనిచేసే ఉద్యోగస్తులు నలబై శాతం వరకు విరామం తీసుకుంటారు. ఒక సర్వే ప్రకారం పూర్తిగా విశ్రాంతి తీసుకున్నా ఈ కండరాలు బిగుసుకొనిపోయి ఇంకా నొప్పి తీవ్రత పెరిగే ఆస్కారం ఉంది. నొప్పి నివారణ మాత్రలు ఎక్కువ వాడితే కడుపులో మంట, ఆకలి మందగించడం, వికారంతో పాటు కొన్ని సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉంటాయి. హోమియోపతి మందులు ఏ విధమైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా వ్యాధి మూలకారణాన్ని తొలగిస్తాయి. డాక్టర్‌, పిజియోథెరపిస్ట్‌, సల హాతో ప్రతీ రోజూ నడుము, మెడ, సంబంధమైన వ్యాయామాలు చేయటం, శరీరం ఎత్తుకు తగ్గ బరువును మెయింటేన్‌ చేయటం, సరైన భంగిమలో కూర్చోవటం ద్వారా వెన్నునొప్పి బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
 
 
డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి, ఎం.డి. హోమియో
స్టార్‌ హోమియో, ఫోన్‌- 8977 336677,టోల్‌ఫ్రీ :1800-108-5566
www.starhomeo.com
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, దుబాయ్‌, లండన్‌, మాంచెస్టర్‌