‘సంతానలేమి’కి సరైన పరిష్కారం

29-08-2017:నేటితరంలో ‘సంతానలేమి’ సమస్య నానాటికీ పెరిగిపోతోంది. మారుతున్న మానవుని జీవనశైలి, ఆహారపు అలవాట్లు, అధిక మానసిక ఒత్తిడి మరియు కొన్ని జన్యుపరమైన అంశాల వల్ల ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతోంది. ‘సంతానలేమి’ సమస్య తలెత్తేందుకు గల కారణాలు స్త్రీ-పురుషుల్లో సమాన స్థాయిలోనే ఉంటాయి. కొన్నిసార్లు ఏ లోపాలూ కనిపించకపోయినా, సంతానలేమి ఉత్పన్న కావచ్చు. ఇలా ఏర్పడే ‘సంతానలేమి’ని వైద్యపరిభాషలో ‘ఇడియోపతిక్‌ ఇన్‌ఫెర్టిలిటీ’ అని పిలుస్తారు.
 
ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ: స్త్రీలు, తమ వివాహానంతరం ఒక సంవత్సర కాలం సాధారణ లైంగిక జీవితం గడిపినా గర్భం ధరించకపోవటం.
సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ: ఒకసారి గర్భధారణ జరిగి పిల్లలు కలగటం లేదా గర్భస్రావం జరగటంతో 2వసారి సంతానం కలగక పోవడం.
 
పురుషులలో ‘సంతానలేమి’కి కారణాలు
అజూస్పెర్మియా: శుక్రకణాలు పూర్తి స్థాయిలో ఉత్పత్తికాకపోవడం
అలిగోస్పెర్మియా: శుక్రకణాలు తక్కువగా ఉత్పత్తి కావడం
అస్తివోస్పెర్మియా: శుక్రకణాలుఉత్పత్తి అయినప్పటికీ వాటి కదలికలు లేకపోవడం
టెరటోస్పెర్మియా: శుక్రకణాల నిర్మాణంలో తేడాలు ఉండటం
వెరికోసిల్‌: వృషణాలలో ఉండే రక్తనాళాలు వాపునకు గురికావడం
హైడ్రోసిల్‌: వృషణాలు ఉండే తిత్తిలో నీరు చేరడం, వృషణాలు శోథనకు గురికావటం లేదా అధిక వేడి తగలడం, అంగస్థంభన లోపం, శీఘ్రస్కలనం మొదలగు లైంగిక సమస్యలు
పిట్యుటరీ, థైరాయిడ్‌. టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ల అసమతుల్యత
అధిక బరువు, మధుమేహం, పొగతాగటం మరియు జన్యుపరమైన అంశాలు మొదలగునవి ‘సంతానలేమి’కి కారణమవుతాయి.
స్త్రీలలో ‘సంతానలేమి’కి కారణాలు
గర్భసంచి చిన్నదిగా ఉండటం లేదా గర్భసంచి లేకపోవడం
గర్భసంచి నిర్మాణంలో లోపాలు ఉండటం, గర్భసంచిలో కణుతులు ఏర్పడటం, ఎండోమెట్రియోసిస్‌
ఫెలోపియన్‌ ట్యూబ్స్‌ లేకపోవడం, ట్యూబ్స్‌ మూసుకుపోవడం
అండాశయ నిర్మాణ లోపాలు, అండాశయంలో సరైన ఎదుగుదల లేకపోవడం
జననాంగం చిన్నదిగా ఉండటం, లేదా ఆ మార్గం మూసుకుపోవడం
శుక్రకణాలు ఈదటానికి జననాంగ మార్గంలోని మ్యూకస్‌ పొర అనువుగా లేకపోవటం
జననాంగం అధిక ఆమ్లగుణం కలిగి ఉండటం వలన శుక్రకణాలు చనిపోవటం
హార్మోన్‌ సమస్యలు: హైపోథారాయిడ్‌ మరియు హైపర్‌ థైరాయిడిజమ్‌ సమస్యలు, పీసీఓడి, ఎఫ్‌ఎస్ హెచ్‌, ఎల్‌హెచ్‌, ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ల అసమతుల్యత వంటి అంశాలన్నీ ‘సంతానలేమి’కి కారణమవుతాయి.
 
హోమియోకేర్‌ ఇంటర్‌నేషనల్‌ వైద్యం
జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషనల్‌ వైద్యంలో జరిగే ‘హోమియోకేర్‌ ఇంటర్‌నేషనల్‌’ చికిత్సలో భాగంగా స్ర్తీ-పురుషుల సంతానలేమి లోపాలను సరిచేయటం ద్వారా శాశ్వత పరిష్కారం అందించటంతో పాటు రెండవ, మూడవ సంతానానికి మార్గం సుగమం చేయటం జరుగుతుంది. అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి హోమియోపతి ద్వారా ఆరోగ్యకరమైన జీవితం అందించాలన్నదే ‘హోమియోకేర్‌’ దృఢసంకల్పం. ఈ సంకల్పసాధనకు తగినట్లు, సమర్థవంతమైన చికిత్సలతో ‘సంతానలేమి’ని శాశ్వతంగానయం చేయటం జరుగుతంది.
 
ఇటీవలి కాలంలో దక్షిణాది రాష్ట్రాలలో ఘనంగా జరుపుకున్న ‘హోమియోకేర్‌ బేబీ షో’ కార్యక్రమాలలో భాగంగా కాన్స్‌టిట్యూషనల్‌ చికిత్సల సహాయంతో పండంటి సంతానం పొంది - తల్లిదండ్రులుగా మారిన దంపతులంద రినీ సాదరంగా ఆహ్వానించి, వారి కుటుంబ సంతోషాలను హోమియోకేర్‌ ఇంటర్‌నేషనల్‌ స్వయంగా పంచుకుంది. ఇక సంతానలేమి బాధితులెవరైనా సరే! మీకు దగ్గరలోని హోమియోకేర్‌ ఇంటర్‌నేషనల్‌ క్లినిక్‌ను సంప్రదించి, సంతానం కలగాలన్న మీ ‘కల’ను సాధ్యమైనంత త్వరలో ‘నిజం’చేసుకోమని మా సలహా! ఇక ఆలస్యం మీదే!!
 
 
                                                                                                                                                             డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌ CMD
                                                                                                                                                             హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
                                                                                                                                                             టోల్‌ ఫ్రీ : 1800 108 1212
                                                                                                                                                             ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99
                                                                                                                                                             తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి