సైనసైటిస్‌కు హోమియోనే దీటైన వైద్యం

ఆంధ్రజ్యోతి(02-10-2016): నిరంతరం జలుబుతో ముఖమంతా వాచిపోయి , తలంతా బరువుగా ఉండి, జీవితాన్ని నిస్తేజం చేసే సమస్య సైనసైటిస్‌. ఏళ్ల తరబడి వేధించే ఈ సమస్యకు హోమియోలో అద్భుతమైన వైద్యం ఉంది. సహజంగానే, ముక్కు, కళ్ల చుట్ట్టూ నాలుగు గదులు ఉంటాయి. వీటినే సైన్‌సలు అంటారు. మనం శ్వాసన పీల్చినప్పుడు గాలి ముక్కునుంచి సైన్‌సలలోకి వెళుతుంది. మనం పీల్చేగాలిని సమశీతోష్ణస్థితికి తె చ్చే బాధ్యతను కూడా ఇవే నిర్వర్తిస్తాయి. సైన్‌సల నుంచి వచ్చే ద్రవాలు ముక్కు ద్వారా బయటికి వెళతాయి. అయితే ఈ సైన్‌సలల్లో వైర స్‌, బ్యాక్టీరియా ఫంగ ల్‌ చేరడం వల్ల విపరీతమైన ొప్పి పుడితే దాన్ని సైనసైటిస్‌ అంటారు. 
 
ఏమిటా కారణాలు?
కొన్ని కార ణాల వల్ల సైనస్‌ ముఖ ద్వారం మూసుకుపోతుంది. లేదా వాటిల్లో మ్యూకస్‌ బాగా పేరుకుపోతుంది. ఫలితంగా అక్కడ బ్యాక్టీరియా ఇతర క్రిములు సులభంగా పెరిగి సైనసైటిస్‌ సమస్య మొదలవుతుంది. శ్వాసకోశ మార్గానికి ఇన్‌ఫెక్షన్‌ రావడం వ ల్ల సైన్‌సలకు బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ వ స్తుంది. ఫలితంగా తీవ్రమైన సైనసైటిస్‌ సమస్య మొదలవతుంది. కొందరికి సైన్‌సలలోల వాపు రావడంతో పాటు, బాగా నొప్పిగా ఉంటుంది. చాలా కాలం ఈ సమస్యకు వైద్య చికిత్సలు అందకపోతే, దీన్ని క్రానిక్‌ సైనసైటిస్‌ అంటారు. 
లక్షణాలు 

 తరుచూ జలుబు చేయడం, జలుబుతో ఎక్కువ రోజులు బాధపడటం అనేది సైనస్‌ వ్యాధి ప్రాధమిక లక్షణం. ఆ తర్వాత దశలో జలుబు ఇంకా కొనసాగుతూ ముక్కులు బిగుసుకుపోయి తల అంతా బరువుగా ఉంటుంది. ఆ పైన ముక్కు నుంచి పసుపు పచ్చని, ఆకుపచ్చని ద్రవాలు రావడం మొదలవుతుంది. 

 తీవ్రమైన తలనొప్పి, ద గ్గుతో పాటు శ్వాస దుర్ఘంధంతో ఉంటుంది. ఈ లక్షణాలతో పాటు కొందరి ముక్కులో నిరంతరం దురదగా ఉంటుంది. ముఖం, తల అంతా బరువుగా ఉంటుంది. ఒక దశలో మ్యూకస్‌ ముక్కు వెనుక భాగంలోంచి గొంతులోకి వెళుతుంది. 

 ముఖంలో వాపు కనిపిస్తుంది. దంతాలు, కళ్ల వెనుక భాగంలో కూడా నొప్పి కలుగుతుంది. కొద్ది రోజులకు వాసన తెలియకుండా పోతుంది. గొంతు మంటగానూ, నోరు చేదుగానూ మారుతుంది. కొందరిలో వినికిడి సమస్యలు కూడా మొదలవుతాయి. అలసటతో పాటు తరుచూ జ్వరం కూడా రావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే ఆ వ్యక్తి సైనసైటి్‌సతో బాధ పడుతున్నాడని భావించాలి. 

ఏ సైన్‌సలకు సమస్య ఉంటే ఆ ప్రాంతంలో నొప్పి, మొద్దుబారినట్టు ఉంటుంది. కంటి పై భాగంలో ఉండే సైన్‌సలకు సమస్య వస్తే నుదుటి బాగం, కనుబొమ్మల ప్రాంతం అంతా నొప్పిగా ఉంటుంది. చెంప ఎముకలో సమస్య వస్తే, కళ్ల కింది భాగం, పై దవడ , పళ్లు నొప్పిగా ఉంటాయి. రెండు కళ్ల మధ్య బాగంలో సమస్య వస్తే, ముక్కు చుట్టు పక్కల అంతా నొప్పి వస్తుంది. కళ్ల చుట్టూ వాపు ఏర్పడుతుంది. ముఖం లోపలి భాగాలకు సైనస్‌ వస్తే తల, చెవి, మెడ నొప్పి వస్తుంది. సైనస్‌ తీవ్రంగా ఉన్నప్పుడు ఏ విషయం మీదా దృష్టి కేంద్రీకరించలేరు. 

వ్యాధి నిర్ధారణా పరీక్షలు 
కొన్ని పరీక్షలు చేయడం ద్వారా వ్యాధి తీవ్రతను గుర్తించవచ్చు. సైబర్‌ ఆప్టిక్‌ స్కోప్‌ ద్వారా వ్యాధి నిర్ధారణ సులువవుతుంది. కొన్ని సందర్భాల్లో సీ. టీ స్కానింగ్‌ కూడా చేయవలసి రావచ్చు. ఎం. ఆర్‌. ఐ వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. మరికొన్ని ఇతర రక్తపరీక్షలు కూడా వ్యాధి నిర్ధారణలో తోడ్పడతాయి. 
 
హోమియో చికిత్స
హోమియో చికిత్సతో సర్జరీ అవసరం లేకుండానే సైనసైటిస్‌ సమస్యను సమూలంగా తొలగించవచ్చు. పైగా హోమియో మందులతో ఏ విధమై దుష్ప్రభావాలూ ఉండవు. నిజానికి ఇతర చికి త్సల వల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుందే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. అదే హోమియో చికిత్సతో అయితే సమస్య సమూలంగా శాశ్వతంగా తొలగిపోతుంది. 
 
 
డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి, ఎం.డి. 
హోమియో, స్టార్‌ హోమియోతి, 
ఫోన్‌- 8977 336677, 
టోల్‌ర ఫీ :1800-108-5566 
www.starhomeo.com
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక