థైరాయిడ్‌ సమస్యకు సమూల వైద్యం

02-08-2017: నానాటికీ పెరిగిపోతున్న హైపో, హైపర్‌ థైరాయిడ్‌ సమస్యలతో మానవాళి తీవ్రమైన ఆందోళనకు గురవుతోంది. దీనికి కారణం ఇది జీవితాంతపు సమస్య అనీ, అందువల్ల బతికినంత కాలం మందులు మింగుతూనే ఉండాల్సి ఉంటుందని వారు అనుకోవడమే అందుకు కార ణం. వాస్తవానికి ఇది ఒక నిర్ణీత కాలంలోనే ఈ సమస్య పూర్తిగా తొలగిపోతుందని అంటున్నారు.

 
మానవుడి శరీరంలోని అతి ముఖ్యమైన గ్రంధుల్లో థైరాయిడ్‌ ఒకటి. ఈ గ్రంధి మెడ ప్రాంతంలో కంఠం దగ్గర, సీతాకోక చిలుక రెక్కల ఆకృతిలో శ్వాసనాళానికి ఇరు పక్కలా ఉంటుంది. ఇది థైరాయిడ్‌ హార్మోన్లను (టి3, టి4) ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు రక్తప్రవాహంలో కలిసి శారీరక ఎదుగుదలను, వివిధ జీవక్రియలను నిర్వహిస్తాయి. మెదడులోని పిట్యూటరీ గ్రంధి, ఈ థైరాయిడ్‌ గ్రంధిని నియంత్రణలో ఉంచుతుంది. శరీరంలో తగినంతగా థైరాయిడ్‌ హార్మోన్లు లేనప్పుడు పిట్యూటరీ గ్రంధి అవసరాన్ని గ్రహించి టిఎస్‌హెచ్‌ - థైరాయిడ్‌ స్టిములేటింగ్‌ హార్మోన్లను విడుదల చేస్తుంది.
 
ఈ టిఎస్‌ హెచ్‌ సంకేతంతోనే థైరాయిడ్‌ గ్రంధి టి3, టి4 అనే థైరాయిడ్‌ హార్మోన్లను ఉత్పత్తి చేసి రక్త ప్రవాహంలోకి పంపుతుంది. థైరాయిడ్‌ ఇలా నిరంతరం మన శరీరంలో హార్మోన్లు తగిన స్థాయిలో ఉండే లా చేస్తుంది. ఎప్పడైనా ఈ వ్యవస్థ విఫలమై, థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తి ఎక్కువైనా తక్కువైనా సమస్యగా పరిణమిస్తుంది. వీటి అసమతుల్యతల వల్ల హైపో థైరాయిడ్‌, హైపర్‌ థైరాయిడ్‌, గాయిటర్‌ అనే దీర్ఘకాలిక సమస్యలు మొదలవుతాయి.
 

హైపోథైరాయిడిజం

ఇది సర్వసాధారణంగా కనిపించే థైరాయిడ్‌ సమస్య. ఇది శరీరంలో థైరాయిడ్‌ హార్మోన్లు కావలసిన దానికంటే తక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడం వల్ల వస్తుంది. స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
 
లక్షణాలు
నిస్సత్తువ, బలహీనత, చర్మం పొడిబారడం, చెమట తక్కువగా రావడం, బరువు పెరగడం, నెలసరి సరిగా రాకపోవడం, జుట్టు రాలడం, మతిమరుపు, మలబద్ధకం, అజీర్ణం, చలికి తట్టుకోలేకపోవడం, పిల్లల్లో ఎదుగుదల తగ్గడం, ఆడపిల్లల్లో రజస్వల ఆలస్యం కావడం లేదా ముందుగా రావడం, వృద్ధుల్లో కుంగుబాటు, మతిమరుపు వంటి లక్షణాలు ఉంటాయి. గర్భిణుల్లో జీవక్రియల వేగం పెరుగుతుంది. అందువల్ల థైరాయిడ్‌ హార్మోన్ల అవసరం పెరిగి హైపోథైరాయిడిజం రావచ్చు.
 
హైపర్‌ థైరాయిడిజం
శరీరంలో థైరాయిడ్‌ హార్మోన్ల అవసరాన్ని మించి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుండటాన్ని హైపర్‌ థైరాయిడిజం అంటారు. ఈ సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు. కాకపోతే 20 - 40 ఏళ్ల మధ్య వయసు వారే ఎక్కువగా ఈ సమస్యకు గురవుతుంటారు. మొత్తం థైరాయిడిజం బాధితుల్లో 80 శాతం మంది హైపోథైరాయిడిజం సమస్యకు గురైతే, 20 శాతం మందిలో మాత్రమే హైపర్‌ థైరాయిడిజం సమస్య ఉంటుంది.
 
లక్షణాలు
సరియైున ఆహారం తీసుకున్నా, బరువు తగ్గడం, నిద్రలేమి, గుండెదడ, వేడిని తట్టుకోలేకపోవడం, అధికంగా చెమటలు రావడం, చిరాకు అస్థిమితత్వం, విరేచనాలు, చేతులు వణకడం, నీరసంగా ఉండడం, నెలసరి త్వరగా రావడం, బహిష్టులో అధిక రక్తస్రావం కావడం వంటి లక్షణాలు వీరిలో కనిపిస్తాయి.
 
గాయిటర్‌
గొంతు కింద ఉండే థైరాయిడ్‌ గ్రంధి అసహజంగా వాపునకు గురి కావడాన్నే గాయిటర్‌ అంటారు. ముఖ్యంగా ఇది అయోడిన్‌ లోపం వల్ల వస్తుంది. కొన్ని సార్లు థైరాయిడ్‌ హార్మోన్లు టి3, టి4 సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ గాయిటర్‌ రావచ్చు.
 
లక్షణాలు
గొంతు కింది వాపు ఎక్కువగా ఉంటే శ్వాసనాళం, ఆహార నాళం పైన ఒత్తిడి పెరిగి మింగడానికి కష్టంగా ఉండడం, స్వరంలో మార్పులు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. వీటితోపాటే కొందరిలో హైపో మరియు హైపో థైరాయిడ్‌ లక్షణాలు కూడా ఉండవచ్చు.
 
హోమియోకేర్‌ వైద్యం
ప్రస్తుత పరిస్థితుల్లో మానవుడి జీవనం తీవ్రమైన ఒత్తిడికి గురికావడం వల్ల ఎక్కువ శాతం మంది థైరాయిడ్‌ సమస్యల బారిన పడుతున్నారు నిజానికి థైరాయిడ్‌ సమస్యలకు జీవిత కాలమంతా మందులు వాడాల్సిన అవసరం లేదు. ఈ సమస్య రావడానికి గల మూలకారణాన్ని గుర్తించి వ్యక్తిత్వానికి అనుగుణంగా సరియైున హోమియో వైద్యం అందించడం ద్వారా థైరాయిడ్‌ సమస్యలను సంపూర్ణంగా నయం చేయవచ్చు.
 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
టోల్‌ ఫ్రీ : 1800 108 1212
ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక,
తమిళనాడు, పాండిచ్చేరి