కిడ్నీలో రాళ్లకు హోమియో చికిత్స

30-01-2018: మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం ఈ మధ్య కాలంలో చాలా మందిలో కనిపిస్తున్న సమస్య. ఒక సర్వే ప్రకారం భారత్‌లోని పురుషుల్లో 10.6 శాతం, స్ర్తీలలో 7.1 శాతం ఈ సమస్యతో బాధపడుతున్నారని తేలింది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, స్థూలకాయం వంటివి దీనికి ప్రధాన కారణాలు. మన శరీరం ఒక భారీ కర్మాగారం లాంటివి. ఇందులో నిరంతరం రకరకాల జీవక్రియలు జరుగుతుంటాయి. వీటిలో మూడు విసర్జక అవయవాలు కీలక పాత్ర పోషిస్తాయి. అవి మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం. వీటిల్లో 90 శాతం మలినాలను విసర్జించేది మూత్రపిండాలే. కిడ్నీలు రక్తంలోని విష పదార్థాలను, అదనపు నీటిని క్రమంగా తొలగిస్తుంటాయి. మన మూత్రపిండాలు రోజుకు 200 లీటర్ల రక్తాన్ని వడపోస్తాయి. నేటి ఆధునిక జీవన శైలిలో చాలామంది సరిపడా నీళ్లు కూడా తాగలేకపోతున్నారు. ఫలితంగా మూత్రపిండాల్లో రాళ్ల సమస్య పెరుగుతోంది. చాలా సందర్భాల్లో ఈ రాళ్లు చిన్నవిగా ఉండి, మూత్రంతో విసర్జింపబడతాయుయి. కొన్నిసార్లు రాళ్ల పరిమాణం పెద్దవిగా ఉండి, మూత్ర నాళాల్లో చిక్కుకుని తీవ్రమైన నొప్పి కలిగిస్తాయి.

కారణాలు
అధిక బరువు, ద్రవపదార్థాలు సరిపడా తీసుకోకపోవడం
మూత్రావయవాల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్‌
జన్యుపరమైన ఇన్‌ఫెకనుఉ్ల
ఎక్కువగా వేడి వాతావరణంలో ఉండటం
వంశపారంపర్యం
కొన్ని రకాల మందుల వాడకం

లక్షణాలు

పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి
నీరసం, వికారం, తీవ్రమైన జ్వరం
మూత్రంలో రక్తం పడటం (దీన్ని హిమచ్యూరియా అంటారు)
మూత్రంలో మంట, చీము రావడం

జాగ్రత్తలు

నీటిని ఎక్కువగా తాగాలి. కనీసం రోజుకు 4 లీటర్ల ద్రవ పదార్థాలు తీసుకోవాలి.
కిడ్నీలో ఆక్సెలేట్‌ రాళ్లు ఉంటే, ఆక్సలేట్‌ ఉండే పదార్థం, అంటే చాక్‌లెట్‌, పాలకూర, సోయా, ఎండు చిక్కుడు వంటివి తీసుకోకూడదు.
కాల్షియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది. కాబట్టి అవి శరీరానికి అందేలా ఆహార నియమాలు పాటించాలి.
కూల్‌డ్రింక్‌లను అసలు ముట్టుకోకూడదు

 

నిర్థారణ పరీక్షలు

కిడ్నీ ఎక్స్‌రే, అల్ర్టాసౌండ్‌ స్కాన్‌, కిడ్నీ పరీక్ష
రక్త పరీక్ష, మూత్ర పరీక్ష

హోమియో చికిత్స

హోమియోపతిలో శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే కిడ్నీలో రాళ్లు తొలగించవచ్చు. రాళ్ల పరిమాణం, అవి ఏ వైపు ఏర్పడ్డాయో వంటి వివరాల ఆధారంగా మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. మ్యుయంగగాఆ బెరిబెరి వల్గరీస్‌, సరసపరిల్ల, కలెబారియకార్బ్‌, పెరిర బ్రావ, కొలొసింత్‌ మందులను డాక్టర్‌ పర్యవేక్షణలో వాడాలి.
 
 
డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి, ఎం.డి. హోమియో
స్టార్‌ హోమియో, ఫోన్‌- 8977 336677,
టోల్‌ర ఫీ :1800-108-5566, www.starhomeo.com
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, దుబాయ్‌, లండన్‌, మాంచెస్టర్‌