హార్మోన్‌ సమస్యలకు హోమియో పరిష్కారం

05-09-2017: మనిషి జీవించడానికి శ్వాస ఎంత ముఖ్యమో.. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లూ అంతే ముఖ్యం. గర్భాశయంలో పిండం ఏర్పడినప్పటి నుంచి మనిషి కాలం తీరేవరకు శరీరంపై హార్మోన్ల ప్రభావం ఉంటుంది.

శరీరంలోని ఒక కణం నుంచి మరొక కణానికి రసాయనిక సమాచారం అందజేయబడి, సంకేతం తెలిపే కెమికల్స్‌ని హార్మోన్లు అంటారు. మెదడు భాగంలోని హైపోథాలమస్‌ హార్మోన్‌ మరియు పిట్యూటరి గ్రంథి హార్మోన్ల ఉత్పత్తికి దోహదపడి శరీరంలోని కణాల క్రమబద్ధీకరించుటకు ప్రాముఖ్యత వహించును. ఈ హార్మోన్ల శరీర ఉష్ణోగ్రతను, ఆకలిని, మానసిక స్థితిని, నిద్రను, దాహము, కామక్రోధమును అదుపులో ఉంచుతాయి.
 
ఈ మధ్యకాలంలో హైపోథైరాయిడ్‌, పిసిఒడి, సంతానలేమి, డయాబెటిస్‌ వంటి దీర్ఘకాలిక జబ్బులన్నీ హార్మోన్‌ అసమతుల్యత వల్ల వచ్చేవే. చాలా రకాల హార్మోన్లు మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయి.
 
హార్మోన్లు పాలిపెప్టైడ్‌తో నిర్మితమైన రసాయన వాహకాలు. ఇవి శరీరంలో ఒక ప్రాంత కణజాలం, అవయవాల నుంచి ఉత్పత్తి అయి, వివిధ శరీర భాగాలకు రక్తం ద్వారా ప్రవహించి నిర్ధిష్ట అవయవాన్ని ప్రభావితం చేసి జీవప్రక్రియల సమతుల్యతకు తోడ్పడతాయి. ఈ హార్మోన్ల సమతుల్యం దెబ్బతిన్నపుపడు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు.
 
ఈ హార్మోన్లు ఎండోక్రైన్‌, ఎక్సోక్రైన్‌ గ్రంథుల నుంచి ఉత్పత్తి అవుతాయి. శరీరంలో ఇవి సూక్ష్మమోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణ జీవక్రియలైన జీర్ణక్రియ, శారీరక, మానసిక ఎదుగుదల, మానసిక సమతుల్యత జీవక్రియలకు తోడ్పడుతాయి.
 
థైరాయిడ్‌ హార్మోన్లు టి3, టి4 ఇవి థైరాయిడ్‌ గ్రంథి నుంచి ఉత్పత్తవుతాయి. వీటి అసమతుల్యత వల్ల హైపో థైరాయిడ్‌, హైపర్‌ థైరాయిడ్‌, గాయిటర్‌ అనే దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి.
 
స్త్రీలలో హార్మోన్స్‌ సమస్యలు
ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌, ప్రొలాక్టిన్‌, ఆక్సిటోసిన్‌ హార్మోన్లు స్త్రీలలో నెరసరి, సంతానోత్పత్తి, ప్రసవంలో ఉపకరిస్తాయి. ఈ హార్మోన్లు అసమతుల్యత వల్ల స్త్రీలలో నెలసరి సమస్యలు, అవాంఛిత రోమాలు, సంతానలేమి వంటి సమస్యలు వస్తాయి. స్త్రీలలో మెనోపాజ్‌, నెలసరి వచ్చే సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల వేడి ఆవిర్లు, మానసిక అశాంతి, నీరసం, కీళ్ల నొప్పులు వస్తాయి.
 
పురుషుల్లో హార్మోన్స్‌ సమస్యలు
మగవారిలో ముఖ్యంగా టెస్టోస్టిరాన్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి అవుతుంది. ఇది ఎముకల సాంద్రతకు, కండరాల పటుత్వానికి, వీర్యకణాల వృద్ధికి ఉపయోగపడుతుంది. ఈ టెస్టోస్టిరాన్‌ లోపం వలన సెక్స్‌ సమస్యలు, కండరాలు పటుత్వం తగ్గిపోవడం, డిప్రెషన్‌, టైప్‌2 డయాబెటిస్‌ అంతేగాక ఎల్‌హెచ్‌ మరియు ఎఫ్‌ఎ్‌సహెచ్‌ డిఫీసియెన్సీ వలన హైపో గొనాడిజమ్‌ వచ్చే అవకాశం ఉంది. టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ అసమతుల్యత వల్ల శీఘ్రస్కలనం, అంగస్తంభన సమస్యలు, వీర్యకణ లోపాలు, సంతానలేమి సమస్యలు వస్తాయి.పిల్లల్లో బరువు, ఎత్తు, ఎదుగుదల సమస్యలు వస్తాయి.
 
హోమియో చికిత్స
హార్మోన్ల ప్రభావం శరీరం మీద ఎంతో ఉంది. థైరాయిడ్‌ సమస్యతో బాధపడేవారు జీవితాంతం మందులు వాడాల్సి వస్తుందని వాపోతుంటారు. అంతేగాక మందులు మానేయడం వలన సమస్య పెరిగే అవకాశం ఉంది. థైరాయిడ్‌ సమస్య కాకుండా ఇతర హార్మోన్ల సమస్యలను తొలగించడానికి ఇప్పుడు హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి.
 
హోమియోపతిలో రోగి యొక్క శారీరక, మానసిక, అనువంశిక, వంశపారంపక తత్వాలను విశ్లేషించి చికిత్స అందించడం జరుగుతుంది. ఉదాహరణకు థైరాయిడ్‌కు కల్కేరియా కార్బ్‌, థైరాడిసమ్‌, భ్రోమియమ్‌, సల్ఫర్‌ మరియు ఇతర సమస్యలకు హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. వీటిని అనుభవజ్ఞులైన డాక్టర్‌ పర్యవేక్షణలో వాడాలి. తద్వారా వ్యాధిని సమూలంగా నయం చేయవచ్చు.
 
 
                                                                                                                    డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి, ఎం.డి. హోమియో
                                                                                                                    స్టార్‌ హోమియోతి, ఫోన్‌- 8977 336677, టోల్‌ ఫ్రీ :1800-108-5566
                                                                                                                    www.starhomeo.com
                                                                                                                    ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, దుబాయ్‌, లండన్‌, మాంచెస్టర్‌