పైల్స్‌ వ్యాధికి హోమియో వైద్యం

22-08-2017: అర్శమొలలు, మొలలు, హెమరాయిడ్స్‌ ఇలా ఎన్ని పర్యాయ పదార్థాలున్నా ఎక్కువ మంది ఈ సమస్యను పైల్స్‌ అనే అంటారు. పైల్స్‌ సమస్య ఉన్న వారి బాధ నిజంగా వర్ణణాతీతం. మలద్వారంలో మొలల్లా పొడుచుకురావడం వల్ల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, మంట ఉంటాయి. ఆ భాగంలో సూదులు గుచ్చుకుంటున్నంత బాధ ఉంటుంది. వీరు ఒకచోట కూర్చోలేరు, నిలుచోలేరు. ఒక దశలో మొలలు చిట్లడం వల్ల రక్తస్రావం కూడా అవుతుంది. 

ఈ రక్తస్రావం ఎక్కువ కాలం కొనసాగితే రక్తహీనత (ఎనీమియా) రావడానికి అవకాశం ఉంది. పెద్దపేవు చివరి భాగాన్ని మలనాళం లేదా రెక్టం అంటారు. ఇక్కడ అధికంగా ఉండే రక్తనాళాల్లో వాపు ఏర్పడం వల్ల ఈ స్థితి ఏర్పడుతుంది. మొలలు పురీషనాళం వెలుపలి భాగంలో వస్తే ఎక్స్‌టర్నల్‌ హెమరాయిడ్స్‌ అనీ, లోపలి భాగంలో వస్తే ఇంటర్నల్‌ హెమరాయిడ్స్‌ అనీ అంటారు. ఈ స్థితిని మూలశంక అని కూడా పిలుస్తారు.

కారణాలేమిటి?
పైల్స్‌ రావ డానికి గల ప్రధాన కారణం మలబద్ధకం. విసర్జన సమయంలో ముక్కడం వల్ల మలద్వారంలోని కణజాలం వాపునకు గురవుతుంది. కొందరిలో దీర్ఘకాలిక విరేచనాల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ప్రసవ సమయంలో గర్భస్థ శిశువు ఒత్తిడి మలద్వారం మీద అధికం కావడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. పురురషుల్లో ప్రోస్టేట్‌ గ్రంధిలో వాపు ఏర్పడటం వల్ల, మలనాళం లేదా పురీషనాళం మీద ఒత్తిడి పెరగడం వల్ల పైల్స్‌ సమస్య రావచ్చు. పొత్తి కడుపు లేదా పేగుల్లో కేన్సర్‌ సంబంధిత కణుతులు ఏర్పడటం వల్ల కూడా పైల్స్‌ రావచ్చు. కొందరిలో వంశానుగతంగానే వారి కుటుంబ వ్యక్తులకు మలనాళం దగ్గరి సిరలు బలహీనంగా ఉంటాయి. ఇదికూడా పైల్స్‌కు దారి తీయవచ్చు. అధికబరువు, స్థూలకాయం, కూడా ఒక దశ లో పైల్స్‌కు మూలం కావచ్చు. వీటితో పాటు పీచుపదార్థం లేని ఆహారం తీసుకోవడం వల్ల కూడా పైల్స్‌ సమస్య రావచ్చు.
 
హెమరాయిడ్‌లో దశలు...
మొదటి దశలో మొలలు, మలనాళంలో ఉంటూ బయటికి కనిపించవు. రెండో దశలో హెమరాయిడ్లు మలనాళం గోడల వెలుపలికి చొచ్చుకుని వస్తాయి. అయితే పురుషద్వారం తెరుచుకుని ఉన్నప్పుడు వెలుపలికి వచ్చి మలద్వారం మూసుకోగానే లోపలికి వెళ్లిపోతాయి. మూడవ దశలో హెమరాయిడ్స్‌ వెలుపలికి వచ్చినా చేతితో నెట్లినప్పుడు లోనికి వెళ్లిపోతాయి. నాలుగవ దశలో ఏర రకంగానూ లోపలికి వెళ్లకుండా వెలుపలే వేళ్లాడుతూ ఉండిపోతాయి.
 
ఇవీ లక్షణాలు...
హెమరాయిడ్స్‌ లోపలి భాగంలోనే ఉన్నప్పుడు ఏ లక్షణాలూ కనిపించవు. మలద్వారం తెరుచుకున్న.ప్పుడు మాత్రం మలద్వారం ద్వారా రక్తం వస్తుంది. మలద్వారం చుట్టూ దురద కూడా రావచ్చు. హెమరాయిడ్స్‌ మూడు నాలుగో దశకు చేరుకున్నప్పుడు తీవ్రమైన నొప్పితోపాటు చీము కూడా వస్తుంది.
 
నివారించలేమా?
ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా అంటే పీచుపదార్థం ఎక్కువగా ఉండే పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, తృణధాన్యాలతో పాటు నీరు ఎక్కువ గా తీసుకోవడం ద్వారా హెమరాయిడ్స్‌ సమస్యను చాలా వరకు నివారించవచ్చు. మాంసాహారం, పచ్చళ్లు, మసాలా పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. తరుచూ సుఖ విరేచనాన్ని కలిగించే మదులను డాక్టర్ల సలహాలతో పాటించడం మేలు. ఆధునిక వైద్యులు ఈ సమస్యను పరిష్కరించడానికి శస్త్ర చికిత్స ఒక్కటే మార్గమని చెబుతుంటారు. వాస్తవానికి శస్త్ర చికిత్స శాశ్వత పరిష్కారం కానే కాదు. మలబద్ధకం కొనసాగుతున్నప్పుడు ఆ సమస్య మళ్లీ మళ్లీ తలెత్తుతూనే ఉంటుంది.
 
హోమియో విశిష్టత
హోమియో మందులతో మొదటి మూడు ద శల్లోని హెమరాయిడ్లను శస్త్ర చికిత్స లేకుండానే నయం చేయవచ్చు. ఈ దశల్లోనే ఉన్నప్పుడే హోమియో చికిత్సలు తీసుకుంటే సమస్య ఆ నాలుగోదశ దాకా వెళ్లే అవకాశమే ఉండదు. బాధించే తక్షణ లక్షణాలను తగ్గించడంతో పాటు సమస్యను శాశ్వతంగా నయం చేసే వైద్య చికిత్సలు హోమియోలో నిండుగా ఉన్నాయి. హోమియో మందుల్లో ప్రత్యేకించి ఆస్‌కులస్‌ హిప్‌, ఆలోస్‌, హెమోయులస్‌, కోలింగ్‌ సానియా, నక్స్‌వామికా వంటివి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. అయితే ఈ మందులను హోమియో వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి.
 
 
డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి, ఎం.డి.
హోమియో, స్టార్‌ హోమియోతి,
ఫోన్‌- 8977 336677,
టోల్‌ఫ్రీ :1800-108-5566
www.starhomeo.com
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక
దుబాయ్‌, లండన్‌, మాంచెస్టర్‌