పీసీఓడీ సమస్యకు హోమియోకేర్‌ వైద్యం

22-08-2017: చాలా మంది స్త్రీల విషయంలో సాధారణ ఆహారపు అలవాట్ల పరంగా ఎలాంటి లోపాలు జరగకపోయినప్పటికీ అధిక బరువు, వెంట్రుకలు రాలిపోవడం, మొటిమలు, అవాంఛిత రోమాలు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇవన్నీ సహజమే అనుకోవడం కొన్ని సార్లు సరికాదు. ఇవి పీసీఓడీ లక్షణాలైతే కచ్ఛితంగా వైద్యుల్ని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి సాధారణ రుతుచక్రం సవ్యంగా ఉన్న మహిళలలో నెలసరి అయిన 11 నుంచి 14 రోజుల మధ్యన గర్భాశయానికి ఇరువైపులా ఉండే అండాశయాలలో ఏదో ఒక అండాశయం నుంచి అండం విడుదల అవుతుంది మరియు ఫలధీకరణకు సిద్ధంగా ఉంటుంది. కాని పీసీఓడీ సమస్య ఉన్నవారిలో అండాశయం నుంచి అండం విడుదల కాకుండా, అపరిపక్వత కలిగిన అండాలు నీటి బుడుగల వలె అండాశయపు గోడల పైన ఉండిపోతాయి. ఇవి చూసేందుకు ముత్యాల వలె అండాశయపు గోడలపైన కనిపిస్తూ ఉంటాయి.
 
కారణాలు
హార్మోన్ల అసమతుల్యత సరైన జీవనశైలి లేకపోవడం అనగా ఎక్కువగా ఒత్తిడికి లోనవడం, శారీరక వ్యాయామం లేకపోవడం పిండి పదార్ధాలు, కొవ్వుపదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం వలన కూడా వచ్చే అవకాశం ఉంది. జన్యుపరమైన అంశాలు కూడా పీసీఓడీ రావడానికి కారణమవుతాయి.
 
లక్షణాలు
నెలసరి సరిగా రాకపోవడం, నెలసరి సరిగా వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం(ఆనోమ్యలేటరీ సైకిల్‌), మెట్రొరేజియా-రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, మెనరేజియా-నెలసరిలో 4నుంచి 5రోజులు కావలసిన రక్తస్రావం ఎక్కువ మోతాదులో ఎక్కువ కాలం కొనసాగడం, డిస్మనేరియా-నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పి రావడం, అమినోరాయా-నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, వెంట్రుకలు రాలిపోవడం, ముఖం, వీపు, శరీరంపైన మొటిమలు రావడం(హిర్సుటిజమ్‌) టెస్టోస్టిరాన్‌ మోతాదు పెరగడం వలన ఈ లక్షణాలు కనిపిస్తాయి.
 
కాంప్లికేషన్స్‌
ఇన్‌ఫెర్టిలిటీ, ఒబేసిటీ, డయాబెటిస్‌ టైప్‌-2
 
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
జీవనశైలి మార్చుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా డయాబెటిస్‌, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అధిక కొవ్వు పదార్థాలు, జంక్‌ ఫుడ్స్‌ తీసుకోకపోవడం వంటి జాగ్రత్తల ద్వారా పిసిఓడి సమస్యను కొంత వరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు.
 
హోమియోకేర్‌ చికిత్స
హార్మోన్‌ అసమతుల్యత వలన వచ్చే ఇలాంటి జబ్బులను హోమియోపతి మెడిసిన్‌ ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు. సరైన కాన్స్‌టిట్యూషనల్‌ ట్రీట్‌మెంట్‌ చేయడం వలన ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా దీనిని పూర్తిగా నయం చేయడమే కాకుండా ఎలాంటి కాంప్లికేషన్లు రాకుండా కాపాడవచ్చు. యుక్తవయస్సులోనే దీనికి సరైన చికిత్సను తీసుకోవడం వలన ఇన్ఫెర్టిలిటీ, ఒబేసిటీ వంటి సమస్యలు రాకుండా చూడవచ్చు. హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ను సంప్రందించినది మొదలు రోగి శరీరతత్వాన్ని బట్టి జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషనల్‌ సిమిలియం విధానం ద్వారా హార్మోన్‌ వ్యవస్థను పరిపుష్టం చేసి ఎటువంటి దుష్ఫలిలతాలు లేకుండా శాశ్వతంగా పీసీఓడీ సమస్యను దూరం చేయవచ్చు.
 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌ CMD
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
టోల్‌ ఫ్రీ : 1800 108 1212
ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక,
తమిళనాడు, పాండిచ్చేరి