వెన్నునొప్పికి హోమియోతో పరిష్కారం

12-09-2017: ఈ రోజుల్లో వెన్నునొప్పి సమస్య చాలా సర్వ సాధారణంగా మారింది. ప్రతీ రోజూ ఎవరో ఒకరు నడుము, మెడ నొప్పుల బాధల గురించి వాపోతున్నారు. మన దైనందిన జీవితంలోని ప్రతి పనిలో మెడ, నడుము భాగాలు కీలకం. కానీ ప్రతి పదిమందిలో ఆరు నుంచి ఎనిమిది మంది వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నారని ఓ అంచనా. మన శరీరంలో వెన్నముక నిర్మాణం, అమరిక చాలా విశిష్టంగా సంక్లిష్టంగా ఉంటుంది. వెన్ను భాగంలో లింగమెంట్లు, కండరాలు, పేసట్‌ జాయింట్‌లు అనుసంధానమై ఉంటాయి.
 
ఇవి శరీరానికి స్థిరత్వాన్నివ్వటంతో పాటు దైనందిన జీవితంలో ఎదుర య్యే రకరకాల భౌతిక ఒత్తిళ్ల బారి నుంచి నరాలను కాపాడ తాయి. అయితే వీటిలో ఏ ఒక్కదానిమీద ఒత్తిడి పెరిగినా, దెబ్బలు తగిలినా.. అధిక బరువులు ఎత్తడం, దించడం వంటి పనులు చేసినా... ఊబకాయం, ఇన్‌ఫెక్షన్లు, కాల్షియం, విటమిన్‌ బీ 12, డీ 3 లోపాల వల్ల ఎముకల సాంధ్రత త గ్గుతుంది. దీనివల్ల వెన్నునొప్పి వస్తుంది. ఈ వెన్నునొప్పికి సర్జరీలు, మందులు, పిజియోథెరపీ వంటి చికిత్సా పద్ధతులకు 70-100 మిలియన్‌ డాలర్ల వరకు ఖర్చుపెడుతున్నారని ఓ అంచనా. దీనివల్ల తమ వృత్తి, ఉద్యోగాలను కూడా మార్చుకుంటున్నారు.
 
ఈ వెన్నునొప్పి దీర్ఘకాలికంగా బాధిస్తూ ఉంటే సర్జరీ (ఆపరేషన్‌) తప్పనిసరి అంటారు. మరి హోమియోపతి విధానంలో కేవలం మందుల ద్వారా దీన్ని నయం చేయవచ్చా?
జీవితాంతం ఈ నొప్పులను భరించాలా అని నిరాశ చెందేవారికి హోమియోపతి విధానం మంచి పరిష్కారం. డిస్క్‌బల్జ్‌, డిస్క్‌ కంప్రెషన్‌లు నరాలను ఒత్తిడికి గురి చేయటం వల్ల తీవ్రమైన వెన్ను నొప్పి వస్తుంది. దీనివల్ల డిస్క్‌బల్జ్‌ల నరాల ఒత్తిడిని తగ్గించడానికి హోమియోపతిలో చాలా రకాల మందులు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, క్లర్కులు వంటి శారీరక శ్రమ లేని ఉద్యోగాలు చేసేవారికి ... ఊబకాయం, నడుము నొప్పితో బాధపడేవారికి (cobalt) కోబాల్ట్‌ అద్భుతమైన ఔషధం. వెన్నెముక చిట్లడం వెన్నుపాముకు దెబ్బతగలడం వంటి సమస్యల నివారణకు ఆపరేషనే మార్గం. కానీ సింఫైటమ్‌, ఆర్నిక, హైపరికం, బెల్లిస్‌, పెర్నిస్‌, అగాలికస్‌, అనే హోమియో మందుల ద్వారా ... ఆపరేషన్‌ అవసరం లేకుండా వెన్నునొప్పిని నయం చేయవచ్చు. పైగా ఏ విధమైన దుష్ప్రభావాలు ఉండవు.
 
సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అంటే ఏమిటి? హోమియోపతిలో చికిత్స ఉందా?
సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ ఇది ఇది మెడలోని c1, c2, c3, c4, c5, c6, c7 వెన్నుపూసలు అనుసంధానమై సర్వైకల్‌ ప్రాంతం అంటారు. ఈ మెడ ప్రాంతంలోని వెన్నుపూస కీళ్ల మధ్యలోని ఖాళీభాగం తగ్గిపోవడం, డిసబల్జ్‌ కావడం, వెన్నుపూస మధ్యలో రాపిడి ఎక్కువ కావడం, ఆస్టియోఫైట్స్‌ చేరడం వలన మెడభాగం నుంచి నొప్పి చేతికి, అక్కణ్నుంచి చేతి వేళ్లకరకు నొప్పితో పాటు తిమ్మిర్లు, చేయి మొద్దుబారటం, మెడ పట్టేయడం, తల తిరగడం. ఒక్కోసారి వాంతి వచ్చినట్లు ఉండటం వంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. ఈ ఆధునిక నగర జీవితం గడిపే ప్రతి పది మందిలో ఐదుగురు ఈ సర్వైకల్‌ స్పాండిలోసిస్‌తో బాధపడుతూ ఉంటారు. హోమియోపతి చికిత్సా విధానం వీరికి ఓ వరం లాంటిది.
 
ముఖ్యంగా యాసిడ్‌ ఫోస్‌ (acid phos) ఏ రకమైన సర్వైకల్‌ స్పాండిలోసిస్‌కైనా పనిచేస్తుంది. కోనియమ్‌ (conum) అనే మందుక తల వెనుక భాగంలో డర్‌పేన్‌తో మెడబిగుత్తుతో తల తిరగడటం, తలభారంగా ఉండటం, కోనియం ప్రధాన లక్షణం. కాల్మియా లతి ఫోలియా (kalmia latifolia) అనే మందు మెడభాగం, చేయి, చేతివేళ్లవరకు నొప్పి ఉంటుంది. విపరీతంగా ఉండి తిమ్మర్లు వస్తూ ఉంటాయి. కల్కేరియా అనే మందు కాల్షియం తక్కువ కావడం, విటమిన్‌ బి12, బి13 సమస్యలు, ఆస్టియో ఫైట్స్‌ ఉండి మెడ భారంగా ఉంటుంది. వయసుతో వచ్చే వెన్నుపూస మార్పులను అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా బయోనియా, స్పైజీలియా, రాష్టాక్స్‌, జెల్సీనియా మందులు డాక్టర్‌ పర్యవేక్షణలో వాడాలి.

 

 

                                                                                                                                                     డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి, ఎం.డి. హోమియో
                                                                                                                                                     స్టార్‌ హోమియో, ఫోన్‌- 8977 336677, టోల్‌ ఫ్రీ :1800-108-5566
                                                                                                                                                     www.starhomeo.com
                                                                                                                                                     ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, దుబాయ్‌, లండన్‌, మాంచెస్టర్‌