హోమియోకేర్‌లో ఆస్తమాకు సరైన వైద్యం

14-06-2019: ఊపిరితిత్తులకు సంభందించిన వ్యాధులలో ముఖ్యమైనది ‘ఆస్తమా’. దీని ప్రభావం రోగి శరీరంపైనే కాకుండా, వారి మానసిక, సామాజిక పరిస్థితులను సైతం దెబ్బతీసే విధంగా ఉంటుంది.
 
ఈ వ్యాధితో బాధపడేవారు ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కోవడం వల ఆ సమయంలో మరణానికి లోనవుతామోనన్నంత ఆందోళనకు గురికావడమే కాకుండా భవిష్యత్తులో ఎదురయ్యే దీని దాడులను తలచుకొని భయానికి లోనవుతుంటారు. ఆస్తమా రోగిపై దాడి చేసే పరిస్థితులు చాలా వరకూ అనూహ్యంగా ఉంటాయి. కొంతమందిలో మానసిక ఒత్తిడి కూడా ఈ వ్యాధిని ప్రేరేపిస్తూ ఉంటుంది.
 
అయినా ఈ వ్యాధితో బాధపడేవారు భయభ్రాంతులకు, ఆందోళనకు గురికావలసిన అవసరం లేదు. కాన్సిట్యూషనల్‌ హోమియో వైద్య విధానం ద్వారా ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచే అవకాశం ఉంది.

అసలు ఆస్తమా అంటే ఏంటి? ఈ వ్యాధి కారణాలు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం.

 
సాధారణంగా మనం పీల్చుకున్న గాలి (O2) వాయుద్వారాల ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. అదేవిధంగా శరీరంలోని (CO2) బయటకు వెళ్లిపోతుంది. ఈ వాయుద్వారాలు శోధమునకు గురి అయి వాపు చెందడం ద్వారా సన్నగా, ఇరుకుగా మారి ఎక్కువ శ్లేష్మాన్ని ఉత్పత్తి చేయడాన్ని ‘‘ఆస్తమా’’ అంటాం.
 
శరీరానికి పడని పదార్థాలను పీల్చుకున్నప్పుడు, వాయుద్వారాలు బలంగా స్పందిస్తాయి. వాటి కండరాలు బిగుసుకుంటాయి. అవి శోధమునకు గురిఅయి వాపు చెందడం ద్వారా సాధారణ స్థాయికి మించి శ్లేష్మాన్ని ఉత్పత్తి చేయడం వల్ల గాలి ప్రసరణకు ఆటంకాలు ఏర్పడడం వల్ల ఆస్తమా లక్షణాలు బయల్పడతాయి.
 
ఆస్తమా వ్యాధిగ్రస్తుల వాయుద్వారాలు ఎప్పుడూ శోధమును కలిగే ఉంటాయి.
 
ఆస్తమాను ప్రేరేపించే అంశాలు: ఇవి అందరిలో ఒక రకంగా ఉండవు. పుప్పొడి రేణువులు, జంతుకేశాలు, దుమ్మూధూళి, బొద్దింకలు. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు- ఫ్లూ, జలుబు. అధిక శారీరక శ్రమ- వ్యాయామం చేయడం వల్ల, చల్లని గాలి లేదా చల్లని వాతావరణం, కాలుష్యం, పొగతాగడం, కొన్ని రసాయనాలు, వృత్తిరీత్తా దుమ్మును ఎదుర్కోవడం, ఆస్పిరిన్‌, బీటాబ్లాకర్స్‌ వంటి మందులు, ఆహారాన్ని నిల్వ చేయుటకై ఉపయోగించే ప్రిజర్వేటివ్లు, అధిక మానసిక ఒత్తిడి వంటి అంశాలు ఆస్తమాను ప్రేరేపిస్తాయి.
 
లక్షణాలు: ఆస్తమా లక్షణాలు ఒక వ్యక్తికి మరోవ్యక్తికి వేరుగా ఉంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చాతీ బిగువుగా లేదా నొప్పిగా అనిపించడం. శ్వాస బయటకు వదిలినప్పుడు పిల్లకూతల వంటి శబ్దాలు వినిపించడం. ఆస్తమా వల్ల వచ్చే దగ్గు రాత్రి, వేకువ జామున అధికంగా ఉంటుంది. శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలను గమనించవచ్చు.
 
హోమియోకేర్‌ చికిత్స : హోమియో వైద్య విధానంలో వ్యాధితో పాటు రోగికి చికిత్స అందించడం జరుగుతుంది. దీని ద్వారా అసమతుల్యతకు గురి అయిన రోగనిరోధక వ్యవస్థను బలపరచడం ద్వారా వ్యాధిని నిర్మూలించే అవకాశం ఉంటుంది. హోమియో వైద్యాన్ని అనుసరించాలి. ఇది కాన్సిట్యూషనల్‌ హోమియో వైద్య విధానం హోమియోకేర్‌ ఇంటర్‌నేషనల్‌లోనే అందించడం జరుగుతుంది. ఈ చికిత్స ద్వారా ఆస్తమా లక్షణాలను తగ్గించడమే కాకుండా దాని వ్యాధి మళ్లీ తిరగబెట్టకుండా నియంత్రించే అవకాశం ఉంటుంది.
 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌ CMD
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
టోల్‌ ఫ్రీ : 1800 108 1212
ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి