సోరియాసి‌స్‌కు హోమియోతో చెక్‌!

06-02-2018: దీర్ఘకాలం పాటు బాధించే మొండి చర్మవ్యాధుల్లో సోరియాసిస్‌ ముఖ్యమైనది. ప్రపంచ వ్యాప్తంగా 125 మిలియన్ల మంది సోరియాసితో బాధపడుతున్నారని అంచనా. స్త్రీ, పురుష తేడా లేకుండా అందర్నీ బాధించే వ్యాధి సోరియాసిస్‌.

 
సోరియాసిస్‌ బాధితులు శారీరకంగా, మనసికంగా నలిగి పోతున్నారు. అయితే హోమియోపతి వైద్యవిధానం సూచించిన సంపూర్ణ శారీరక, మానసిక తత్వ శాస్త్రాన్ని అనుసరించి ఈ వ్యాధిని నిర్మూలించవచ్చు.
 
సోరియాసిస్‌ దీర్ఘకాలిక చర్మవ్యాధి. చర్మంపైన దురదతో కూడిన వెండిరంగు పొలుసులు, పొడలు కనిపిస్తాయి. ఇవి ఎర్రగా, వాపుతో ఉంటాయి. గోళ్లు, తల, తదితర శారీరక భాగాలకు కూడా రావచ్చు. మొదట్లోమచ్చలు ఎర్రగా కమిలిపోయినట్లు కనిపించినా, సమయం గడిచే కొద్దీ ఈ మచ్చలపైన తెల్లని పొలుసులు మందంగా పేరుకుపోతాయి. పొలుసులను తొలగిస్తే అడుగున రక్తపు చారికలు కనిపిస్తాయి. అయితే చల్లటి వాతావరణం, ఇన్‌ఫెక్షన్లు, తీరుబడిగా ఉన్నప్పుడ దురద ఎక్కువవుతుంది. బాదితుల్లో 10-20 శాతం మందికి తీవ్రమయిన కీళ్లనొప్పులు కూడా ఉంటాయి.
 
అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది!
ఆరోగ్యవంతుల్లో చర్మం ఉపరితలం కింద కొత్త కణాలు నిరంతరమూ తయారవుతుంటాయి. సుమారు నెలరోజుల్లో ఇవి వెలుపలకు చేరుకుంటాయి. పొరగా ఏర్పడి క్రమంగా నీర్జీవమై ఊడిపోయి కింది కణాలను బహిర్గత పరుస్తాయి. సోరియాసిస్‌ వ్యాధిలో ఈ ప్రక్రియ అదుపు తప్పుతుంది చర్మపు కణాలు వేగంగా తయారై మూడు, నాలుగు రోజులకే వెలుపలకు చేరుకుంటాయి. అదనపు కణ సముదాయానికి పోషకతత్వాలను అందించే నిమిత్తం రక్తసరఫరా పెరుగుతుంది దీంతో చర్మంపైన ఎర్రని పొడ, పొలుసులు ఏర్పడతాయి.
 
ఎందుకు వస్తుంది?
వ్యాధి నిరోధక శక్తి వికటించి స్వయం ప్రేరితంగా మారటం వలన సోరియాసిస్‌ వస్తుందని పరిశోధనలు చెపుతున్నాయి. వైరస్‌, బ్యాక్టీరియాల దాడి నుంచి రక్షణ పొందటానికి ఏర్పరచిన అపశృతులను సరిచేయటానికీ మన శరీరంలో తెల్లరక్త కణాలు పనిచేస్తుంటాయి. ఇవి అవసరమైన ప్రాంతాలకు వెళ్లి ఇన్ఫెక్షన్లను తగ్గించటమే కాక గాయాలను మానేలా చేస్తాయి. దీనినే వ్యాధి నిరోధక శక్తి అంటున్నాం.
ఈ నేపథ్యంలో అనుబంధ అంశంగా ఇన్‌ఫ్లమేషన్‌(ఎరుపుదనం, వాపు) తయారవుతుంది. సోరియాసి్‌సలో ఈ వ్యాధి నిరోధక శక్తి శరీర కణజాలాన్ని అన్య పదార్థంగా అన్వయించుకొని, దాడి చేసి ఇన్‌ఫ్లమేషన్‌ కలిగిస్తుంది. ఫలితంగా చర్మకణాలు పెరిగే పొలుసులుగా తయారవుతాయి. అయితే వ్యాధి నిరోధక శక్తిలో ఈ మార్పులు జన్యుపరమైన కారణాలు, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు వల్ల ఇలా జరుగుతుంది.
 
సోరియాసిస్‌ - రకాలు: సోరియాసిస్‌ను స్థూలంగా 1) సోరియాసిస్‌ వల్గారిన్‌ 2) గట్టేజ్‌ సోరియాసిస్‌ (గట్టా అంటే బిందువు) 3)పుస్టులార్‌ (పస్‌ అంటే చీము)4.) ఎరిత్రోడెర్మల్‌ సోరియాసిస్‌ (ఎరిత్రో అంటే ఎరుపు) గా వర్గీకరించారు.
 
చికిత్సా విధానం - హోమియోపతి దృక్పథం
ఏదైతే వ్యాధికి కారణమవుతుందో అదే చికిత్సకు ఉపయోగపడుతుందనే ప్రకృతి సహజ సిద్దాంతంపై హోమియోపతి వైద్యవిధానం ఆధారపడి ఉంది.
ఒకే రకమయిన ప్రేరణ లేదా ప్రేరకానికి భిన్న వ్యక్తుల భిన్న భిన్న రకాలుగా స్పందిస్తారనే అస్తివాదంపైన హోమియోపతి ఆధారపడి ఉంది.
సోరియాసిస్‌ విషయంలో వెంటనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. హోమియో వైద్య విధానంలో ప్రతి ఔషధం మానసిక లక్షణాలతో ముడిపడి ఉంటుంది. మానసిక - శారీరక తత్వాన్ని ఆధారంగా చేసుకుని మందులనూ సూచిస్తారు. అయితే చికిత్సా ఫలితాలు ఆహార వ్యవహార, ఔషధాల సమిష్టి ప్రయోగాన్ని బట్టీ, వ్యాధి ఉదృతిని బట్టి ఉంటాయి.
సోరియాసి్‌సకు సాధారణంగా ఆర్సెనికం ఆల్బం (శీతాకాలం ఎక్కువగును), సల్ఫర్‌, కాలిఆర్స్‌, సోరినమ్‌, మెజీరియం, పెట్రోలియం వంటి మందులను వాటి వాటి లక్షణాలనకనుగుణంగా వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఇవి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి.