ఆటో ఇమ్యూన్‌ వ్యాధులకు అసమాన వైద్యం

02-08-2017: వ్యాధుల బారిన పడకుండా కాపాడటానికి, వ్యాధులతో పోరాడటానికి మన శరీరంలో ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. అయితే కొందరిలో ఆ రక్షణ వ్యవస్థ పొరబడి, తన సొంత శరీరం పైనే దాడి చేస్తుంది. పలితంగా పలురకాల వ్యాధులు చోటుచేసుకుంటూ ఉంటాయి.

 
వాటిలో ప్రధానంగా థైరాయిడ్‌ సమస్యలు, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, డయాబెటిస్‌, విటిలిగో (తెల్ల మచ్చలు) సొరియాసిస్‌, రక్తహీనత, కండరాల నొప్పులు, చర్మ సమస్యలు, లూపస్‌ ఎరిథిమాటసిస్‌ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వీటితో పాటు కిడ్నీ సమస్యలు, ఎడిసన్స్‌ డిసీజ్‌, పల్మనరీ థైబ్రోసిస్‌, వంటి వ్యాధులు వచ్చి పడే అవకాశం ఉంది. వీటినే ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు అంటారు. బ్యాక్టీరియా, వైరస్‌, కెమికల్స్‌, వాతావరణ కాలుష్యం వంటి కారణాలతో పాటు వంశానుగత కారణాల వల్ల కూడా ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
 
ఎలా తెలుస్తుంది?
కండరాల నొప్పి, నీరసం, జ్వరం, అలసట, కీళ్లనొప్పుల వే ధిస్తాయి. చర్మంతో పాటు రక్తకణాలు, ర క్తనాళాల వంటివి ఈ వ్యాధితో ఎక్కువగా ప్రభావితం అవుతుంటాయి.
 
రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌...
ఇదొక ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్‌. జీవక్రియల్లో ఏర్పడే ఒక అసమతుల్యత వల్ల తలెత్తే ఒక ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌. ఇది శరీరంలో ఇరు వైపులా ఉండే కీళ్లకు సమాంతరంగా వ్యాపిస్తుంది. దీనివల్ల కీళ్లల్లో వాపు ఏర్పడి, శరీర కదిలికలన్నీ స్థంభించిపోతాయి. ఇదొక అంగవైకల్యం లాంటిదే. కీళ్లనొప్పులు వాపు, కీళ్లు పట్టేయడం వంటి సమస్యలు కూడా వీరిని వేధిస్తాయి. ఈ వ్యాఽధిలో మోకాలి సైనోవియల్‌ దెబ్బతినడంతో కీ ళ్లల్లో వాపు ఏర్పడటమే కాకుండా, క ళ్లు, నోరు, ఊపిరితిత్తులకు కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
 
థైరాయిడ్‌ సమస్యలు
ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌లో భాగంగా శరీరంలో యాంటీబాడీస్‌ తయారవడం వల్ల అవి థైరాయిడ్‌ గ్రంథికి వ్యాపిస్తాయి. ఇలా వ్యాపించడానికి కొన్ని నెలలనుంచి కొన్ని సంవత్సరాల దాకా పడుతుంది. రేడియేషన్‌ చికిత్స తీసుకున్న వారిలో కూడా కొందరికి థైరాయిడ్‌ గ్రంధి దెబ్బతిని హైపోథైరాయిడిజం రావచ్చు. ఒకవేళ హైపర్‌ థైరాయిడిజం వ స్తే దాన్ని గ్రేవ్స్‌ డి సీజ్‌ అంటారు.
 
లక్షణాలు
మలబద్దకం, డిప్రెషన్‌, నీరసం, అలసట, జుత్తు రాలిపోవడం, గోళ్లు విరగడం, కాళ్లూ చేతుల్లో వాపు ఏర్పడటం, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
 
సొరియాసిస్‌
సొరియాసిస్‌ అనేది శరీరమంతా పొలుసులు ఏర్పడే ఒక దీర్ఘకాలిక చర్మ వ్యాధి. దీనివల్ల దురదతో పాటు శరీరమంతా ఎర్రమచ్చలు వ్యాపిస్తాయి. స్త్రీ పురుషులు ఇరువురూ ఈ వ్యాఽధికి సమానంగానే గురవుతారు. సొరియాసిస్‌ వర్గారిస్‌, గట్టేట్‌ సొరియాసిస్‌, పుస్టులార్‌ సొరియాసిస్‌, ఎరిథోడెర్మల్‌ సొరియాసిస్‌ అంటూ ఈ వ్యాధి నాలుగు రకాలు. సొరియాసిస్‌ వ్యాధిగ్రస్తుల్లో చర్మం ఎర్రబడటంతో పాటు, జుట్టు రాలిపోవడం, కీళ్ల నొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీళ్లల్లో చర్మం పొడిబారినప్పుడు చర్మంపైన పగుళ్లు ఏర్పడి రక్తస్రావం అవుతుంది.
 
డయాబెటిస్‌
టైప్‌-1 డయాబెటిస్‌ అనేది ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌లోని మరో రకం. టైప్‌ -1 డయాబెటిస్‌ 20 ఏళ్ల లోపే మొదలవుతుంది. టైప్‌-2 డయాబెటిస్‌ 20 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తుంది ఈ రెండింటితో పాటు టైప్‌-3 అనే మూడో రకం డయాబెటిస్‌ కూడా ఉంది. దీన్ని గెస్టేషనల్‌ డయాబెటిస్‌ అంటారు. ఇది గర్భిణుల్లో కనిపిస్తుంది.
 
సిస్టమిక్‌ ల్యూపస్‌ ఎరిథిమేటస్‌ (ఎస్‌ఎల్‌ఇ)
ఇది శరీరంలోని సమస్త అవయవాలనూ దెబ్బతీసే ఒక ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌. ఇది ఎక్కువగా 15 నుంచి 35 ఏళ్ల లోపు స్త్రీలల్లో కనిపిస్తుంది.
 
లక్షణాలు
ముఖం మీద దద్దుర్లు రావడం, చర్మం ఎర్రబడటం, పొలుసులు రావడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో కనిపిస్తాయి. వీటితో పాటు చర్మం మీద నల్లటి మచ్చలు ఏర్పడటం, కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు, శరీరమంతా వాపులు ఏర్పడటం, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి దీర్ఘకాలికంగా ఉంటే మూత్ర పిండాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ వ్యాధికి గురైన గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం లేదా పిండ మరణం జరిగే అవకాశాలు ఉన్నాయి.
 
హోమియో చికిత్స

హోమియో వైద్య విధానంలో వ్యాధి లక్షణాలు, శారీరక, మానసిక స్థితి గతులు, వారి ఆహారపు అలవాట్లను పరిగణనలోకి తీసుకుని, చికిత్స అందించడం జరుగుతుంది. ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్లన్నింటికీ హోమియోలో మంచి మందులు ఉన్నాయి. ఈ మందులతో ఏ విధమైన దుష్ప్రభావాలూ ఉండవు. మన రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా హోమియో మందులు ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌లను సమూలంగా నయం చేసే అవకాశాలు నిండుగా ఉన్నాయి.

 

 
డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి, ఎం.డి.
హోమియో, స్టార్‌ హోమియోతి,
ఫోన్‌- 8977 336677,
టోల్‌ ఫ్రీ :1800-108-5566
www.starhomeo.com
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక
దుబాయ్‌, లండన్‌, మాంచెస్టర్‌