అలర్జిక్‌ రైనైటిస్‌కు సరైన పరిష్కారం

25-07-2017: శీతాకాలం అనగానే మనల్ని ఎక్కువగా భయపెట్టేవి శ్వాసకోశ సమస్యలు. మన పరిసరాలలో లేదా మన ఇంట్లోనే ఈ తరహా అలర్జీలతో బాధపడేవారిని చూస్తుంటాం. అందులోనూ ముఖ్యంగా ‘అలర్జిక్‌ రైనైటిస్‌’ బాధితులే అధికం. వీరు తమ ఆహారపు అలవాట్లలో, జీవన విధానంలో మార్పులు చేసుకోవడం, శీతల పానీయాలను సేవించకపోవడం వంటి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ వ్యాధి బారినపడుతుంటారు.
‘అలర్జిక్‌ రైనైటిస్ ’కు గురైన పిల్లలు స్కూలు మానివేయడం, పెద్దవారైతే ఆఫీసుకు వెళ్లలేకపోవడం కొందరైతే రోజువారీ దినచర్యల పరంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతర వైద్య విధానాల్లో దీనికి కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే పొందవచ్చు. కానీ సరైన హోమియో చికిత్స ద్వారా, ఈ వ్యాధిని పూర్తిగా అధిగమించవచ్చు. సహజంగా మన రోగ నిరోధక వ్యవస్థ జరిపే అసందర్భ ప్రతిచర్యనే అలర్జీ అంటారు. అంటే మన శరీరానికి సరిపడని ఏదైనా పదార్థానికి స్పందనగా సాధరణానికి మించిన ప్రతిక్రియ జరగడం.. దానికి కారణమైన పదార్థాన్ని ‘అలర్జెన్‌’ అని, అలాంటి ప్రతిచర్యని ‘అలర్జిక్‌ రియాక్షన్‌’ అంటారు.
 
‘అలర్జిక్‌ రైనైటిస్‌’ అనగా:  అలర్జెన్‌లు శ్వాస ద్వారా మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు, మనలోని రోగనిరోధక వ్యవస్థ సాధారణ స్థితికి మించి ఎక్కువగా ప్రతిక్రియ జరపడం వలన ముక్కులోకి శ్లేష్మపు పొర శోథనముకు గురికావడాన్ని వైద్యపరిభాషలో ‘అలర్జిక్‌ రైనైటిస్‌’ అని అంటారు. ఇది రెండు రకాలు..
 
సీజనల్‌ అలర్జిక్‌ రైనైటిస్‌: కేవలం ఒక ప్రత్యేకమైన కాలంలో మాత్రమే ఎదురుపడే అలర్జీ సమస్యను ‘సీజనల్‌ అలర్జిక్‌ రైనైటిస్‌’ అంటారు. పూల మొక్కల నుంచి వెలువడే పుప్పొడి రేణువుల వలన ఇది ఎక్కువగా కలుగుతుంది.
 
పెరీనియల్‌ అలర్జిక్‌ రైనైటిస్‌: సంవత్సరం పొడవునా ఏ కాలంలోనైనా ‘అలర్జిక్‌ రైనైటిస్‌’ సమస్యకు గురికావడం జరిగితే.. అటువంటి అలర్జీ సమస్యను ‘పెరీనియల్‌ అలర్జిక్‌ రైనైటిస్‌’ అంటారు. దుమ్మూ-ధూళి, జంతుకేశాల వంటి అలర్జెన్స్‌లకు శరీరం సున్నితంగా స్పందించడం వల్ల ఈ తరహా రైనైటిస్‌ కలుగుతుంది.
 
కారణాలు: మన శరీరంలోకి ప్రవేశించిన అలర్జెన్‌ నుంచి రక్షణ కల్పించడానికి హిస్టమిన్‌ అనే రసాయనం విడుదల కాబడి, తద్వారా అలర్జీ సమస్య ఏర్పడటంతో వెంటనే అలర్జిక్‌ లక్షణాలు కనిపిస్తాయి. పూలమొక్కల నుంచి వెలువడే పుప్పొడి రేణువులు, దుమ్మూ-ధూళి, బూజు, జంతు కేశాలు, వాతావరణ కాలుష్యం, పొగ తాగడం వంటి అంశాలన్నీ ఈ సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు.
 
లక్షణాలు: అధికసంఖ్యలో తుమ్ములు రావడం, ముక్కు కారడం, ముక్కు, కళ్లు దురదగా ఉండటం, కళ్ల వెంబడి నీళ్లు కారడం, దగ్గు, తరచూ తలనొప్పి, ముఖం వాపుగా ఉండటం, నీరసం, ఒళ్లు నొప్పులు మరియు మగతా ఉండటం, చర్మం ఎక్కువగా పొడిబారడం, దురదగా ఉండటం, చర్మంపై బొబ్బలు ఏర్పడటం వంటి ఎగ్జిమా లక్షణాలను కూడా గమనించవచ్చు.
 
దుష్ఫలితాలు: చిన్నపిల్లలు తరచూ దీర్థకాలికంగా ఈ వ్యాధికి గురైనట్లయితే, అలాంటి పరిస్థితి ముఖ్యంగా ఆస్థమాకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. మరియు సైనసైటిస్‌, చెవిలో ఇన్‌ఫెక్షన్లు, నిద్రలేమి, దంత సమస్యలకు దారి తీస్తుంది.
 
నిర్ధారణ పరీక్షలు: చాలావరకు రోగి లక్షణాలను బట్టి ‘అలర్జిక్‌ రైనైటిస్ ’ను నిర్ధారించవచ్చు. జూ సీబీపీ, ఈఎస్ ఆర్‌, అబ్‌సెల్యూట్‌ ఇసినోఫిల్‌ కౌంట్‌ వంటి పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. 
రేడియో అలెగ్రో సార్బెన్ట్‌ టెస్ట్‌ (ఆర్‌ఏఎస్ టీ) ద్వారా మన శరీరంలో ఎంత వరకు ఐజీఈ ఆంటీ బాడీస్‌ ఉన్నాయో తెలుసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.
 
హోమియో చికిత్స: హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌లో మాత్రమే అందించబడే అధునాతమైన జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషనల్‌ హోమియో చికిత్సా విధానం ద్వారా, ఎలాంటి శ్వాసకోశ సమస్యలనైనా సంపూర్ణంగా నయం చేయవచ్చు. రోగి యొక్క మానసిక, శారీరక తత్వాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం మాత్రమే ఈ కాన్స్‌టిట్యూషనల్‌ ట్రీట్‌మెంట్‌ ప్రారంభించబడుతుంది. ఈ విశిష్ట చికిత్సతో శరీర రోగనిరోధక వ్యవస్థలో గల అసమతుల్యతలను సరి చేయడం ద్వారా పైన తెలిపిన అలర్జీని కలిగించే పరిస్థితులు ఎదురైనప్పటికీ, మరోసారి తిరగబెట్టని విధంగా ఈ ‘అలర్జిక్‌ రైనైటిస్‌’ సమస్య సంపూర్ణంగా నయం కాబడుతుంది.
  
 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌ CMD
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
టోల్‌ ఫ్రీ : 1800 108 1212
ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక,
తమిళనాడు, పాండిచ్చేరి