యుటరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ సమస్యకు సరైన పరిష్కారం

05-09-2017:ప్రస్తుత గణాంకాల రీత్యా దాదాపు 17 కోట్లకు పైగా స్త్రీలు ఈ యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌తో బాధపడుతున్నారు. దీన్ని బట్టి ఈ వ్యాధి స్త్రీల పట్ల ఎంత ప్రమాదకరంగా మారిందో ఊహించవచ్చు. సాధారణంగా 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు స్త్రీలల్లోనే యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. పిల్లల్ని కనే వయసు స్త్రీలల్లో కూడా ఇవి ఎక్కువగానే ఏర్పడతాయి. గమనిస్తే, దాదాపు 5- 10 శాతం స్త్రీలలో సంతానలేమికి యుటెరైడ్సే కారణమని స్పష్టమవుతుంది.

యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ అంటే....!
గర్భాశయంలో ఉండే కణుతులను లేదా గడ్డలను యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ అంటారు. సాధారణంగా ఇవి గర్భాశయపు కండర కణజాలంలో ఏర్పడతాయి. ఈ కణుతులు ఒక టిగా గానీ, లేదా చిన్నచిన్న కణుతుల గుంపులుగా గానీ, ఏర్పడతాయి. ఈ ఫైబ్రాయిడ్స్‌ మిల్లీ మీటరు మొదలుకుని, కొన్ని సెంటీ మీటర్ల వరకు పెరుగుతాయి. ఈ కణుతులు గర్భాశయంలో ఏర్పడే ఉనికి- ఎదుగుదల అధారంగా, మూడు రకాలుగా కనిపిస్తూ ఉంటాయి.
 
యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ రకాలు
సబ్‌ సీరోసల్‌ పైబ్రాయిడ్స్‌: గర్భాశయపు వెలుపలి గోడలపై ఇవి ఏర్పడతాయి. నిజానికి సంతానలేమి పై వీటి ప్రభావం చాలా తక్కువే. కాకపోతే వీటి పరిమాణం పెరిగే కొద్దీ ఇవి ‘సంతానలేమి’ పై తమ ప్రభావాన్ని చూపుతాయి.
 
ఇన్‌ట్రామ్యూరల్‌ ఫైబ్రాయిడ్స్‌: గర్భాశయపు గోడల మధ్యన ఇవి ఏర్పడతాయి. ఇవి చాలా సాధారణమైనవి. వీటి పరిమాణాన్ని బట్టి ఇవి గర్భాశయపు ఆకారాన్ని మార్చివేయడంతో పాటు, గర్భాశయపు కుహరాన్ని (గదిని) చిన్నదిగా చేసి పిండం ఎదుగుదలను అడ్డుకుంటాయి. లేదా గర్భప్రావానికి దారి తీస్తాయి.
 
సబ్‌-మ్యూకోసల్‌ ఫైబ్రాయిడ్స్‌: గర్భాశయంలో ఉండే మ్యూకోజల్‌ పొరలో ఇవి ఏర్పడతాయి. ఇవి పిండ ప్రతిస్థాపనను (ఇంప్లాంటేషన్‌), ఎదుగుదలను అడ్డుకుని, సంతానలేమికి కారణమవుతాయి. ముఖ్యంగా ఈ కణుతులు గర్భాశయంలో ఉండే పెలోపియన్‌ ట్యూబ్స్‌ పైన ఒత్తిడి పెరగడం వల్ల గానీ, అండం ప్రయాణించే దిశలో అడ్డంకులు ఏర్పడటం వల్ల గానీ, సంతాన లేమి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొందరిలో గర్భాశయం ముఖద్వారం వద్ద (సర్విక్స్‌) ఫైబ్రాయిడ్స్‌ ఏర్పడి, శుక్రకణాలు వెళ్లే దారిలో అడ్డుపడుతుంటాయి. ఇలా కూడా సంతాన లేమి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌తో బాధపడే గ ర్భిణుల్లో పిండంతో పాటే పైబ్రాయిడ్స్‌ పెరగడం వల్ల పిండానికి సరైన పోషణ అందక గ ర్భస్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
 
యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ లక్షణాలు
వీటి లక్షణాలు - అవి ఏర్పడిన స్థలం, పరిమాణం, వాటి సంఖ్యను బట్టి ఉంటాయి. అయితే కణుతులు చాలా చిన్నవిగా ఉంటే లేదా మెనోపాజ్‌ వచ్చే దశలో ఉంటే ఆ లక్షణాలేవీ దాదాపు క నిపించకపోవచ్చు. రుతుక్రమం ఆగిపోయిన వారిలో ఇవి కుంచించుకుపోవచ్చు కూడా. ఈ స్థితిలో బహిష్టులో అధిక రక్తస్రావం లేదా ఎక్కువ రోజులు రక్తస్రావం కొనసాగడం, ఉంటాయి. దీనివల్ల రక్తహీనత కూడా ఏర్పడవచ్చు. ఇదే సమయంలో నడుము నొప్పి, కడుపు నొప్పి, కాళ్లనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవే కాకుండా, ఫైబ్రాయిడ్స్‌ వల్ల మూత్రాశయం మీద ఒత్తిడి పెరిగి తరుచూ మూత్రానికి వెళ్లాలనిపించడం, మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
 
వ్యాధి నిర్ధారణ పరీక్షలు
వ్యాధి లక్షణాలను బట్టి గానీ, పెల్విక్‌ ఎగ్జామినేషన్‌, అల్‌ట్రా సౌండ్‌, ట్రాన్స్‌ వెజైనల్‌ స్కాన్‌, రక్తపరీక్ష, యం, ఆర్‌, ఐ, బయాప్సీ, హిస్టిరోస్కోపీ, హిస్టిరో సాలింగోగ్రఫీ, లాప్రోస్కోపీ వంటగి పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు
 
హోమియో ప్రత్యేకత
హోమియో చికిత్సలో గర్భాశయ కణుతులను కరిగించడమే కాకుండా, హార్మోన్ల అసమతుల్యతను, రుతుచక్ర సమస్యలను సరిచేసే సంపూర్ణ చికిత్సలు ఉంటాయి.పైగా శస్త్ర చికిత్సతో గర్భాశయాన్ని తొలగించే అవసరం లేకుండా కేవలం మందుల ద్వారానే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. తద్వారా సంతానానికి మార్గం సుగమం చేయవచ్చు.
  
 
                                                                                                                                 డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లవర్‌ CMD
                                                                                                                                 హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
                                                                                                                                 టోల్‌ ఫ్రీ : 1800 108 1212
                                                                                                                                 ఉచిత కన్సల్టేషన్‌ 9550001188/99
                                                                                                                                 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి