బవెల్‌ సిండ్రోమ్‌కు సరైన వైద్యం

30-01-2018: ఒక రోజు విరేచనాలు, మరొకసారి మలబద్ధకం వంటి లక్షణాలు మీలో ఒకదాని వెంట ఒకటి కనిపిస్తున్నట్లయితే మీరు ‘ఐబీఎస్‌’(ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌) గురించి తెలుసుకోవడం మంచింది. నేటి కాలంలో ఈ ‘ఐబీఎస్‌’ సమస్యతో బాధపడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. దీనికి మారుతున్న జీవన శైలి, అధిక మానసిక ఒత్తిడి, ఆహార లోపం, కొన్ని గ్యాస్ట్రిక్‌ ఇన్‌ఫెక్షన్‌లు మొదలైనవి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ప్రతి అయిదుగురిలో ఒకరు తమ జీవితకాలంలో ఈ వ్యాధి బారిన పడటం జరుగుతుంది. వయస్సుకు సంబంధం లేకుండా ఏర్పడే ఈ వ్యాధి ఎక్కువగా 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా పురుషుల కంటే స్త్రీలలో ఇది 1.5 రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి ఇతర వైద్య విధానాలలో కేవలం తాత్కాలిక ఉపశమనం లభించే అవకాశం మాత్రమే ఉంటుంది. కానీ కాన్‌స్టిట్యూషనల్‌ హోమియో వైద్య విధానం ద్వారా దీర్ఘకాలిక ఉపశమనం లభించే అవకాశం ఉంది.

 
ఇరిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌: పేగుల్లో క్రమరాహిత్యం ఏర్పడటం లేదా పేగుల అసాధారణ కదలికల వల్ల వచ్చే సమస్యనే ‘ఐబీఎస్‌’ అని అంటాము. ఇది సాధారణంగా పేగు పనితీరులో వచ్చే మార్పుతో ఉత్పన్నమయ్యే సమస్యేగానీ, పేగు నిర్మాణ మార్పులకు చెందినది కాదు. పేగుల కదలికల అంతర్గత నియంత్రణలో లోపం ఏర్పడినప్పుడు సహజ కదలికలకు అదనంగా జరిగే ఎక్కువ వలన విరేచనాలు, తక్కువ కదలికల వల్ల మలబద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
 
కారణాలు: ఈ వ్యాధి ఏర్పడటానికి గల కారణాలలలో ఇంతవరకూ స్పషత లభించలేదు. కానీ మానసిక ఒత్తిడి, గ్యాస్ట్రిక్‌ ఇన్‌ఫెక్షన్‌లు కొన్ని రకాల నూనె పదార్థాలు, మసాలాలు, కొవ్వు పదార్థాలు, కలుషితమైన నీరు-ఆహారం మొదలైన వాటికి పేగులు సున్నితంగా ఉండటం వల్ల అవన్నీ వ్యాధి ప్రేరకాలుగా నిలిచి వ్యాధిని కలుగజేస్తాయి. కొన్ని రకాల యాంటీబయోటిక్‌ మందులను ఎక్కువగా వాడటం మూలంగా అవి మన శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియాకు హాని తలపెట్టిన సందర్భంలో ‘ఐబీఎస్‌’ సమస్య వచ్చే అవకాశం ఉంది.
 
లక్షణాలు: కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు తరచుగా వస్తూ పోతూ ఉంటాయి. ఈ నొప్పులు ఒక్కోసారి సాధారణ స్థాయిలో మొదలై తీవ్రస్థాయికి చేరతాయి. సహజంగా మలవిసర్జన తర్వాత మాత్రమే ఇలాంటి నొప్పులకు ఊరట లభిస్తుంది. కొందరిలో మలవిసర్జన- నీటి విరేచనాలుగా మారవచ్చు లేదా మరికొందరిలో మలబద్ధకం తలెత్తవచ్చు. ఇలాగే ఇంకొందరిలో విరేచనం సాఫీగా కాకపోవడంతో తరచూ వెళ్లవలసి రావడం వంటి లక్షణాలు కనిపిస్తూంటాయి. త్రేన్పులు రావడం, వికారం, ఛాతీలో మంట, తలనొప్పి, కండరాల నొప్పి మొదలైన ఇతర లక్షణాలు కూడా ఏర్పడవచ్చు.
 
నిర్ధారణ పరీక్షలు: వ్యాధి లక్షణాల తీవ్రతను బట్టి ముఖ్యంగా కడుపులో ఇబ్బంది 12 వారాలకు పైగా ఉన్నప్పుడు ఈ కింది వాటిలో ఏవైనా రెండు లక్షణాలు కనబడినప్పుడు ‘ఐబీఎస్‌’ను నిర్ధరించడం జరుగుతుంది.
తరచుగా మలవిసర్జనకు వెళ్లాలనిపించడం
మలంలో చీము కనిపించడం

నివారణ మార్గాలు: ఐబీఎస్‌ బాధితులు పీచు పదార్థాలు తరచూ తీసుకోవాలి. ఇవి రెండు రకాలు. నీటిలో కరిగేవి, కరగనవి. వీటిలో కరిగే పీచు: ఓట్స్‌, సబ్జా గింజలు, కొన్ని రకాల పండ్లు, కూరగాయలల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇవి వీరికి మేలు చేస్తాయి. నీటిలో కరిగే పీచు: ఇది ముఖ్యంగా గోధుమపొట్టు, మొక్కజొన్న పొట్టు వంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. కావున వీరు ఎక్కువగా ఈ పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. క్రమం తప్పకుండా వేళకు భోజనం చేయడం, శరీరానికి సరిపడా నీరు తాగడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు.

హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ చికిత్స: హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ అందించబడే ‘జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషనల్‌ సిమిలియం’ విధానంలో ‘ఐబీఎస్‌’కు గల మూలకారణాన్ని గుర్తించి రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణలోకి తీసుకొని చికిత్స అందించడం ద్వారా వ్యాధి నియంత్రణలో ఉండే అవకాశం ఉంటుంది.