వాయు కాలుష్యంతో గుండెకు దెబ్బ

లండన్‌, మే 26: వాయు కాలుష్యంతో గుండె పనితీరు దెబ్బతిని హృద్రోగాలు వచ్చే ప్రమాదం పెరుగుతోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ముఖ్యంగా డీజిల్‌ వాహనాల నుంచి వెలువడే పర్టికులేట్‌ మ్యాటర్‌(పీఎం) గుండె పోటుకు, హార్ట్‌ ఫెయిల్యూర్‌కు తద్వారా మరణానికి కారణమవుతోందని క్వీన్‌ మేరీ యూనివర్సిటీ, లండన్‌ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు గుండె పనితీరు, నిర్మాణంపై పీఎం2.5 నేరుగా ప్రభావం చూపిస్తుందా లేదా అనే విషయమై తాము అధ్యయనం చేశామన్నారు.