ఆమెది బలమైన గుండె!

06-10-2017: సమాన వయసున్న స్త్రీ, పురుషుల్లో.... మగవారికే ఎక్కువగా గుండెనొప్పి వస్తుందని కెనాడాకు చెందిన గేల్ఫ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. అండాశయ హార్మోన్‌లు, భిన్నమైన జీవగడియారం కారణంగా మహిళల్లో హార్ట్‌ఎటాక్‌ తక్కువగా వస్తుందని సైంటిస్టులు తెలిపారు. మహిళల్లో జీవగడియారం దెబ్బతిన్నప్పటికీ .. ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ వారి గుండెను కాపాడుతుందని వెల్లడించారు. పురుషుల గుండె కణాలతో పోలిస్తే స్త్రీల గుండె కణాలు కూడా భిన్నంగా ఉంటాయని చెప్పారు.