గుండెపోటా..? కాదా..?

త్వరగా గుర్తించే సరికొత్త పరీక్ష

29-09-2017: ఛాతీలో చిన్న నొప్పి రాగానే దాన్ని గుండెపోటుగా భావించి చాలా మంది ఆస్పత్రికి వస్తుంటారు. అలాంటివారికి సాధారణంగా రెండు పరీక్షలు చేస్తారు. ఒకటి ఈసీజీ. రెండోది రక్త పరీక్ష. రక్తంలో ‘ట్రోపోనిన్‌’ స్థాయిలను పరీక్షిస్తారు. మూడు గంటల తర్వాత మరో సారి రక్తంలో ‘ట్రోపోనిన్‌’ స్థాయిలను పరీక్షించి ఆ నొప్పి గుండెపోటు వల్ల వచ్చిందో, గ్యాస్ట్రిక్‌ వల్ల వచ్చిందో నిర్ధారిస్తారు. ఇంత సమయం అవసరం లేకుండా చాలా సులభంగా, త్వరగా గుండెపోటులను గుర్తించే పరీక్షను లండన్‌లోని కింగ్స్‌ కాలేజీ పరిశోధకులు గుర్తించారు. రక్తంలోని ‘కార్డియక్‌ మయోసిన్‌-సి’ ప్రోటీన్‌ స్థాయిలను పరీక్షించడం ద్వారా చాలా త్వరగా గుండెపోట్లను గుర్తించవచ్చని వెల్లడించారు.