వాయు కాలుష్యంతో గుండెపోటు ముప్పు

16-11-2017: ఏ, బీ, ఏబీ(పాజిటీవ్‌, నెగటీవ్‌) రక్త గ్రూపులు కలిగి ఉన్నవారిలో వాయు కాలుష్యంతో గుండె పోటు ముప్పు పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ రక్త వర్గాలు కలిగి ఉన్నవారిలో ఏబీఓ అనే జన్యువు ఉంటుందని, ధమని కాఠిన్యత ఉన్న వారిలో గుండెపోటు ముప్పును ఈ జన్యువు పరీక్షలతోనే అంచనా వేస్తామన్నారు. వాయు కాలుష్యానికి గురైనప్పుడు ఈ జన్యువు కలిగి ఉన్నవారిలో గుండెపోటు ముప్పు ఎక్కువవుతోందని చెప్పారు.