గుండెదడను తగ్గించే చాక్లెట్‌

17-08-2017: చాక్లెట్‌ను తరచూ తీసుకోవడం వలన కలిగే లాభాల గురించి తెలిసిందే! వాటితో పాటు మరొక విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. వారంలో ఒకసారి, నెలలో మూడు లేదా నాలుగు సార్లు చాక్లెట్‌, చాక్లెట్‌ ఆధారిత ఉత్పత్తులను తీసుకోవడం వలన గుండెదడ వచ్చే ప్రమాధాన్ని చాలా వరకూ తప్పించుకోవచ్చన్న విషయం వీరి అధ్యయనంలో వెల్లడైంది. గుండెనొప్పి లేదా గుండెపోటు కారణమయ్యే గుండెదడ వలన కొన్ని సార్లు మరణం కూడా సంభవించవచ్చు. ఈ విపత్తు నుంచి తప్పించుకోవాలంటే చాక్లెట్‌ లేదా చాక్లెట్‌ ఆధారిత ఉత్పత్తులను తరచూ తీసుకోవాలని వీరు సూచిస్తున్నారు. సుమారు 60వేల మంది వీరు అధ్యయనాలు నిర్వహించారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారికి నెలలో ఒకటి రెండు సార్లు మాత్రమే చాక్లెట్‌ ఆధారిత ఉత్పత్తులను అందించారు. మరో గ్రూపు వారికి నెలలో మూడు నాలుగు సార్లు చాక్లెట్‌ ఉత్పత్తులను ఇచ్చారు. అనంతరం వీరి గుండె పనితీరును పరిశీలించారు మొదటి గ్రూపు వారిలో పది శాతం మాత్రమే గుండెదడ తగ్గిన విషయాన్ని గుర్తించారు. రెండవ గ్రూపు వారిలో 20 శాతం వరకూ గుండెదడ తగ్గడాన్ని కనుగొన్నారు. అయితే చక్కెర వ్యాధిగ్రస్తులు చాక్లెట్‌ ఆధారిత ఉత్పత్తులను తీసుకునే సమయంలో వైద్యులను సంప్రదించాలని వారు సూచించారు.