గుండెపోటు రాకుండా చేసే ప్రొటీన్‌!

18-7-2017: డీకెకెకె3.. ఇది మన శరీరంలో ఉండే ఒక ప్రొటీన్‌. మన ఒంట్లో చాలా ప్రొటీన్లు ఉన్నా దీనికో ప్రత్యేకత ఉంది. ఈ ప్రొటీన్‌ స్థాయులు ఎక్కువగా ఉంటే గుండెపోటు, హృద్రోగ సంబంధ వ్యాధులు దరిచేరవట. అంతేకాదు రక్తనాళాలు గట్టి పడకుండా చేసే సామర్థ్యం ఈ ప్రొటీన్‌కు ఉందట. ఈ విషయాన్ని యూకేలోని కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌కు చెందిన పరిశోధకులు తెలిపారు.