బీట్‌రూట్‌ జ్యూస్‌తో బీపీ, హృద్రోగ ముప్పు దూరం

టొరంటో, 15-05-2017: మీరు అధిక రక్తపోటు బాధితులా, మీకు గుండెపోటు ముప్పు ఎక్కువని వైద్యులు హెచ్చరించారా.. అయితే, బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగండి. ప్రతిరోజూ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే ఈ ముప్పు తొలిగిపోతుందని యూనివర్సిటీ ఆఫ్‌ గ్వెల్ఫ్‌ పరిశోధకులు చెబుతున్నారు. ఇందులోని నైట్రేట్‌ రక్తనాళాల వ్యాసా న్ని పెంచుతుందని, ఫలితంగా రక్తపోటు తగ్గిపోతుందన్నారు. దీంతోపాటు సింపథెటిక్‌ నాడీ వ్యవస్థ(ఎ్‌సఎన్‌ఎస్‌) పైనా ప్రభావం చూపిస్తుందన్నారు. ఈమేరకు 20మంది వలంటీర్లపై ప్రయోగాత్మకంగా పరీక్షించి ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు తెలిపారు. పరిశోధనలో భాగంగా.. యువకులను రెండు గ్రూపులుగా విభజించి, ఒక గ్రూపులోని వలంటీర్లకు ఒక నైట్రేట్‌ సప్లిమెంటును, మరో గ్రూపు వారికి ప్లేసిబో(ఉత్తుత్తి మాత్ర) అందజేశారు. అధ్యయనానికి ముందు, పూర్తయిన తర్వాత పరీక్షలు జరిపారు. ఫలితాలను విశ్లేషించగా.. బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగిన వలంటీర్లు రక్తపోటు తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.