ఒక్క పరీక్ష.. 20 రకాల ఫలితాలు

లండన్‌, మే 17: శరీర బరువుతో పాటు శారీరక ఆరోగ్యానికి సంబంధించి 20 రకాల ఫలితాలను వెల్లడించే సరికొత్త వేయింగ్‌ మిషన్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రాణాంతక హృద్రోగ ముప్పును ఇది చెప్పేస్తుందని కౌనాస్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. నమూనా యంత్రాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి వివరాలు వెల్లడించారు. ఇందులోని హ్యాండి ల్‌బార్‌, ఫుట్‌బార్‌లో అమర్చిన సెన్సర్ల సాయంతో గుండె నుంచి పాదాల వరకు రక్తంలో నాడీ తరంగ వేగాన్ని ఈ మెషిన్‌ పరిశీలిస్తుందని చెప్పారు. ఇందులోని పారామీటర్లను అప్‌డేట్‌ చేస్తారు.