గుండె జబ్బు హుష్‌కాకి!

ఆంధ్రజ్యోతి, 11-07-2017: గుండె జబ్బులు, గుండెపోట్లకు దూరంగా ఉండాలంటే.... సులభమైన చిట్కా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వీలైనంత ఎక్కువగా పండు, కాయగూరలు తినాలి. తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. పాలిష్‌ బియ్యం బదులు దంపుడు బియ్యం తినాలి. లీన్‌ ప్రోటీన్లు ఉండే చేపలు, బీన్స్‌, కాయధాన్యాల లాంటి ఆహారాన్ని ఎంచుకోవాలి. ప్రాసెస్డ్‌ ఆహారం, చక్కెర, ఉప్పు, శాచురేటెడ్‌ కొవ్వులకు దూరంగా ఉండాలి.