స్వీట్లు ఎక్కువ తింటే హృద్రోగం

06-10-2017: ఎక్కువ తీపి పదార్థాలు, శీతల పానీయాలు తీసుకుంటే హృద్రోగ ముప్పు ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ఆరోగ్యవంతులైనా మోతాదుకు మించి స్వీట్లు తీసుకుంటే రక్తనాళాల్లో, కాలేయంలో కొవ్వు విపరీతంగా పెరిగి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తమ పరిశోధనల్లో తేలిందని యూకేకు చెందిన వర్సిటీ ఆఫ్‌ సర్రే శాస్త్రవేత్తలు తెలిపారు. కొంతమంది ఆరోగ్యవంతులను రెండు గ్రూపులుగా విభజించి కొందరికి 140కేలరీలు, మరికొందరికి 650 కేలరీల తీపి పదార్థాలు తినిపించి 12 వారాల తర్వాత పరీక్షించగా ఎక్కువ తీపి తీసుకున్న వారిలో హృద్రోగాలు వచ్చినట్లు వెల్లడైందన్నారు.