ఎమ్మారై స్కాన్‌తో గుండెపోటు గుర్తింపు

25-08-2017: గుండెపోటు ఎప్పుడొస్తుందో తెలీదు.. అది వచ్చిందంటే బతకటం కష్టమే. మరి, ఆ వ్యాధిని ముందుగానే గుర్తించే అవకాశాలన్నాయా అంటే.. చాలా తక్కువ. అయితే, కచ్చితత్వంతో ముందుగానే గుండెపోటును గుర్తించే ఎమ్మారై స్కాన్‌ను యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం కరోటిడ్‌ ధమనిలో ఉండే కొవ్వు ఆధారంగానే గుండెపోటు ముప్పును గుర్తిస్తున్నారు. అందులో కొవ్వు పెరిగితే శస్త్రచికిత్స చేసి తొలగిస్తారు. అయితే, ఈ కొత్త ఎమ్మారై స్కాన్‌తో కచ్చితంగా హృద్రోగ వ్యాధుల్ని, గుండెపోటును గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.