దాల్చిన చెక్కతో హృద్రోగాలు దూరం

 న్యూయార్క్‌, మే 7: కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలతో ఎదురయ్యే దుష్పరిణామాలను దాల్చిన చెక్క తగ్గిస్తుందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఆహార పదార్థాల్లోని కొవ్వు, శరీరంలో పేరుకు పోయే ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుందని ఓమిని యాక్టివ్‌ హెల్త్‌ టెక్నాలజీ పరిశోధకుల బృందం పేర్కొంది. ఈ బృందంలో భారత సంతతి పరిశోధకురాలు విజయ జూతూరు కూడా పాల్గొన్నారు. శరీరంలో కొవ్వు నిల్వ అయ్యే ప్రక్రియను నెమ్మదింప జేయడం ద్వారా దాల్చిన చెక్క గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుందని విజయ తెలిపారు. ఈ మేరకు ఎలుకలపై జరిపిన పరిశోధనలలో ఈ విషయం వెల్లడైందన్నారు.