2 నిమిషాల్లోగుండె పరీక్ష చేసే యాప్‌!

07-09-2017: కేవలం రెండు నిమిషాల్లోనే గుండె పనితీరు సక్రమంగా ఉందో లేదో తెలుసుకోవచ్చు! ఇందుకోసం ఆస్పత్రికి కూడా వెళ్లక్కర్లేదు!! స్మార్ట్‌ఫోన్‌ కెమెరా ద్వారానే ఈ పనిని పూర్తి చే యొచ్చు. ఇందుకోసం అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు సరికొత్త యాప్‌ను రూపొందించారు. స్మార్ట్‌ఫోన్‌ కెమెరాను మెడ భాగంలో ఉంచి స్కాన్‌ చేయడం ద్వారా వెంటనే ‘లెఫ్ట్‌ వెంట్రిక్యులర్‌ ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌’ (ఎల్‌వీఈఎఫ్‌) ఈ యాప్‌ గుర్తిస్తుంది. ఒకసారి గుండె కొట్టుకున్నప్పుడు గుండె నుంచి ఎంత శాతం రక్తం పంప్‌ అయ్యిందనే విషయాన్ని ఎల్‌వీఈఎఫ్‌ తెలియజేస్తుంది. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారిలో ఎల్‌వీఈఎఫ్‌ 50-70 శాతం ఉంటుంది. ఇది ఏ మాత్రం గతి తప్పినా వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.