జుట్టు సమస్యలను తగ్గించే మందు వచ్చేసింది..

హైదరాబాద్(07-01-2017):ఈ రోజుల్లో చాలామందికి జుట్టు ఊడిపోతుంది. చిన్న వయసులోనే జుట్టు ఊడిపోయి, వయసైపోయినా వారిలా కనిపిస్తున్నారు. ఇలా జరిగేందుకు చాలా కారణలే ఉన్నాయంటున్నారు డాక్టర్లు. తినే ఆహారం కూడా మనం జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపిస్తుందని వారంటున్నారు. పూర్వం మన పెద్ద వారు చాలా ఒతైన జుట్టుతో నిండుగా కనిపించేవారు. మనలో చాలామంది మనకు అంత అదృష్టం లేదని బాధపడుతుంటారు. కానీ, ఆ అదృష్టం ఆయుర్వేద వైద్య రూపంలో మనదగ్గర ఉందని కొందరంటున్నారు. చాలా మందికి జుట్టు రాలకుండా కాపాడుకోవడానికి రకరకాల షాంపూలను, నూనెలను వాడుతుంటారు. వాటివల్ల ఎంత ప్రయోజనముందో తెలియదు. కానీ, ఈ ఆయుర్వేద వైద్యం వల్ల మాత్రం తప్పకుండా ఫలితం ఉంటుందని ఆయుర్వేద డాక్టర్లు అంటున్నారు. అస్సాం, తమిళనాడు రాష్ట్రాలలో పెరిగే బృంగరాజ అనే చెట్టు ఆకులతో జుట్టు ఒత్తుగా పెరిగే అవకాశం ఉందని వారంటున్నారు. అయితే ఈ చెట్లు కేవలం తడిగా ప్రదేశాల్లో మాత్రమే పెరుగుతాయని వారు చెబుతున్నారు. వీటి ఆకులను ఎండలో ఎండబెట్టి వాటిని కొబ్బరినూనెలో గానీ, నువ్వుల నూనెలోగానీ వేసి నూనె రంగు ఆకుపచ్చగా మారేంతవరకు ఎండలో ఎండబెట్టండి. తర్వాత ఆ నూనెను మడుకు రాసుకుంటే అరగంట తర్వాత కడిగేయాలి. అయితే బృంగరాజ చెట్టు ఆకుల పొడి కూడా మార్కెట్‌లో దొరుకుతుంది. వాటిని జుట్టు పెరుగుదలకే కాకుండా, కాలేయ సమస్యలను తగ్గించే లక్షణాలు కూడా ఇందులో ఉండటం విశేషం.