రొమ్ము కేన్సర్‌ చికిత్సకు కొత్తరకం మాత్రలు

15-7-2017: రొమ్ము కేన్సర్‌ చికిత్సలో ఉపయోగించే కొత్తరకం మాత్రలను శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. ఈ బృందంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త కూడా ఉండడం విశేషం. సైక్లిన్‌ డిపెండెంట్‌ కినా్‌స(సీడీకే) నిరోధకాలుగా వ్యవహరించే ఈ మందులతో దుష్పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం కూడా తక్కువని తెలిపింది. నోటి ద్వారా తీసుకునే ఈ మందులతో హార్మోన్‌ రిసెప్టార్‌ పాజిటివ్‌ కేన్సర్‌ను సమర్థవంతంగా నియంత్రించవచ్చని రొమ్ము కేన్సర్‌ చికిత్సా నిపుణుడు ఆదిత్యా బార్దియా పేర్కొన్నారు. కేన్సర్‌ వేగంగా విస్తరించడానికి సీడీకే ఎంజైమ్‌లు తోడ్పడతాయని, తాజాగా అభివృద్ధి చేసిన కొత్తరకం మందులతో వీటికి అడ్డుకోవచ్చని చెప్పారు.