యాప్స్‌తో స్మోకింగ్‌కు చెక్

ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ(08-01-2017): పొగతాగరాదు.. అని బోర్డులు కనిపించినా.. సిగిరెట్‌ ప్యాక్‌లపై 80 శాతం హెచ్చరికలను ముద్రించినా పొగరాయుళ్లలో మార్పు పెద్దగా వచ్చిందేమీ లేదు. కానీ ఇటీవల కాలంలో తమంతట తాము పొగతాగరాదనే ప్రయత్నాలనైతే పొగరాయుళ్లు చేస్తున్నారంటున్నాయి అధ్యయనాలు. మరీ ముఖ్యంగా ఇందుకు స్మార్ట్‌ఫోన్‌నే వినియోగించుకుంటుండటం విశేషం. క్విట్‌ స్మోకింగ్‌ అంటూనే లైవ్‌ స్ర్టాంగ్‌ అంటూ క్విట్‌ కోచ్‌ సహాయమూ తీసుకుంటున్నారిప్పుడు నగరవాసులు.

 
పొగతాగనివాడు దున్నపోతై పుడతాడని గిరీశం ఏ మూడ్‌లో అన్నారో కానీ.. పొగతాగే వాడు వ్యాధులతో ఛస్తారని ఆధారాలతో చెబుతున్నారు అధ్యయనకారులు. ప్రపంచంలో పొగాకు వినియోగ పరంగా రెండో అతి పెద్దది భారతదేశం. ఇండియన్‌ టుబాకో అట్లాస్‌ పరంగా, 23.2 శాతం మగవారు, 3.2 శాతం మహిళలు, 5.8 శాతం బాలురు, 2.4 శాతం బాలికలు పొగాకు వినియోగిస్తున్నారు. పొగాకు వాడడం పెరిగే కొద్దీ, పొగాకు సంబంధిత వ్యాధులు, ముందస్తు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. భారతదేశంలో సంభవిస్తున్న మరణాలలో పొగాకు కారణంగానే చనిపోతున్నవారిలో 14.3 శాతం మంది పురుషులు, 4.7 శాతం మంది మహిళలు ఉంటున్నారు. ఈ సంఖ్యలే భయపెడుతుంటే యూనివర్సిటీ ఆఫ్‌ యార్క్‌ చేసిన ఓ అధ్యయనం స్మోక్‌లెస్‌ టుబాకో కారణంగా సంభవిస్తున్న మరణాలలో 74 శాతం మరణాలు భారతదేశంలోనే జరుగుతున్నాయని తేల్చి ప్రమాదఘంటికలు మోగించింది. ఈ గణాంకాల ప్రభావమో లేక తమకు పుట్టిన ఆలోచనో కానీ ఇటీవల తమ స్మార్ట్‌ఫోన్‌పై వాడే ఫిట్‌నెస్‌ యాప్‌లతో పాటుగా స్మోకింగ్‌ అలవాటు మాన్పించే యాప్‌లకూ స్థానం కల్పిస్తున్నారు నగరవాసులు. 
స్నేహితుడిలా హెచ్చరిస్తున్నాయ్‌.. 
సైకాలజి్‌స్టల మాటలు.. ప్రభుత్వ ప్రచారం.. ఎన్‌జీవోల ర్యాలీలు.. ఏవీ ప్రభావం చూపకపోతున్న కాలంలో స్మార్ట్‌ఫోన్‌ యాప్స్‌ వల్ల స్మోకింగ్‌ మానేయడం సాధ్యమా అని అంటే.. కొంతమేరకు సాధ్యమే అని చెబుతున్నారు సైకాలజి్‌స్టలు. ‘‘ఈ యాప్స్‌ వల్లనే పొగతాగడం మానేస్తారని చెప్పలేం కానీ ఈ యాప్స్‌ తాము పొగతాగే అలవాటు మానుకోవాలనుకునే వారి బలమైన కోరికను వెల్లడిస్తాయి’’..అని అన్నారు సైకాలజిస్ట్‌ రమణ. వారి ప్రయత్నాలు సిన్సియర్‌గా చేస్తే ఫలితాలు కూడా ఖచ్చితంగా ఉంటాయంటూ స్మోకింగ్‌ మానాలనుకుంటే కావాల్సింది ప్రవర్తన కాదు.. కోరిక. బలమైన కోరిక ఉంటే స్మోకింగ్‌ మానొచ్చు అని అన్నారు. అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసన్‌ అధ్యయనాల ప్రకారం యూఎ్‌సలో 11 మిలియన్‌ మంది స్మోకింగ్‌ అలవాటు వదులుకోవడానికి స్మార్ట్‌ఫోన్‌పై యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. స్మోకింగ్‌ అలవాటును వదులుకోవడానికి యాప్స్‌ ఉపయోగపడతాయని సమాచారం లేదని కూడా ఆ అధ్యయనం వెల్లడిస్తోంది. మన నగరంలో నిజానికి తమ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించి స్మోకింగ్‌ అలవాటు మానుకోవడానికి ప్రయత్నిస్తున్న వారి సంఖ్య స్వల్పమే కానీ ఇటీవల పెరిగిందన్నది రమణ మాట. 
ఎన్నో యాప్స్‌.. గేమింగ్‌ లేటెస్ట్‌ ..! 
ఐ ఫోన్‌ లేదంటే యాపిల్‌ డివైజె్‌సలో అత్యంత ప్రాచుర్యం పొందిన యాప్స్‌లో లైవ్‌సా్ట్రంగ్‌ మై క్విట్‌ కోచ్‌ ఒకటి. ఇది ఓ వ్యక్తి సిగిరెట్‌ అలవాటు మార్చుకోవడానికి ఓ ఉపయుక్తమైన టూల్‌గా చెబుతున్నారు. మీరు రోజుకు ఎన్ని సిగిరెట్లు కాలుస్తున్నారో చెబితే నెమ్మదిగా ఆ అలవాటు ఎలా మానాలో ఇది చూపడమే కాదు..మొత్తం మానేవరకూ ఇది సహాయపడుతుంది. ఆండ్రాయిడ్‌పై అత్యంత పాపులర్‌ యాప్‌ అంటే క్విట్‌ నౌ అనే చెప్పాలి. మీరు ఎంత డబ్బు తగలేస్తున్నారో అంకెలతో చెప్పడమే కాదు ఆరోగ్యం ఏ విధంగా వృద్ధి చెందుతుందో కూడా చూపుతుంది. ఇవికాక విభిన్నమైన అప్రోచ్‌తో సిగిరెట్‌ తాగడాన్ని అడ్డుకునే యాప్స్‌ కూడా చాలా ఉన్నాయి. కొన్ని యాప్‌లు నికోటిన్‌ మీదనే దృష్టి కేంద్రీకరిస్తే మరికొన్ని పొగరాయుళ్ల ప్రవర్తన మీద దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. నికోటిన్‌ మీద దృష్టి కేంద్రీకరించే వాటిలో మై క్విట్‌ కోచ్‌, క్విట్‌ స్మోకింగ్‌ వంటివి బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రవర్తన మీద దృష్టి కేంద్రీకరించిన వాటిలో క్విట్‌ ఇట్‌ లైట్‌, మై లాస్ట్‌ సిగిరెట్‌ ఉన్నాయి. ఇక యూసీఎ్‌సఎఫ్‌ స్టాప్‌ స్మోకింగ్‌, క్విట్‌ నౌ, ఎన్‌హెచ్‌ఎస్‌ స్టాప్‌ స్మోకింగ్‌ లాంటి యాప్స్‌ లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రయత్నించడానికి దోహపడతాయి. స్ఫూర్తిదాయక కంటెంట్‌ను అందించే యాప్స్‌లో కార్వింగ్‌ టు క్విట్‌, క్విట్టర్‌ ఉన్నాయి. సైకలాజి్‌స్టలు చెప్పేదాని ప్రకారం ఫేస్‌ టు ఫేస్‌ కౌన్సెలింగ్‌తో అన్ని వేళలా చేరువ కావడం కష్టం. రియల్‌ టైమ్‌ ఇంటర్‌వెన్షన్‌ అవసరం ఉంటుంది. అందుకు స్మార్ట్‌ఫోన్‌ ఓ మార్గం. ఇక ఇటీవల కొత్తగా వచ్చింది స్మోకోయో-ఈ-సిగిరెట్‌. ఇది స్మార్ట్‌ఫోన్‌తో సింకై మీరు ఎన్ని పఫ్‌లు లాగారో అది ఎన్ని సిగిరెట్లకు సమానమో కూడా చెబుతుంది. అయితే ఇప్పుడు నగరవాసులను అలరిస్తున్నవి మాత్రం గేమింగ్‌ యాప్స్‌. సిగ్‌బ్రేక్‌ ఫ్రీ అంటూ ఇటీవల విడుదల చేసిన యాప్‌ సిగిరెట్‌ ప్రియులను అలరించడంతో పాటుగా సిగిరెట్‌ల పట్ల ఏహ్యభావం కూడా కలిగిస్తుందట. నిజానికి గేమిఫై చేయడం వల్ల స్మోకర్లలో నెమ్మదిగా తమ ప్రవర్తనలో మార్పు చేసుకునే అవకాశాలున్నాయని అధ్యయనకారులు చెబుతున్నారు. ప్రవర్తన మార్పు విధానాలతో పాటుగా సంబంధిత అంశాలను పొందుపరిచిన యాప్స్‌ ద్వారా సిగిరెట్‌ స్మోకింగ్‌ ప్రవర్తనలో మార్పుతీసుకురావచ్చంటున్నారు క్వీన్‌మేరీ యూనివర్సిటీ ఆఫ్‌ లండర్‌ ప్రొఫెసర్‌ రాబర్ట్‌ వాల్టన్‌. 
కొన్ని సిగిరెట్‌ క్విట్టింగ్‌ యాప్స్‌లో 
క్విట్‌ నింజా : ఈ యాప్‌ రాండమైజ్డ్‌ క్లీనికల్‌ ట్రయల్స్‌ కూడా చూపుతుంది. స్మోక్‌ చేయాలనుకునే వ్యక్తులు ఈ యాప్‌ ఓపెన్‌ చేస్తే చాలు.. వీడియోలు, పాజిటివ్‌ సందేశాలు, ఫొటోలు.. చూపి ఇక జీవితంలో స్మోక్‌ చేయకూడదనిపిస్తుంది. 
లైవ్‌ సా్ట్రంగ్‌ మై క్విట్‌ కోచ్‌ : పర్సనలైజ్డ్‌ క్విట్టింగ్‌ కోచ్‌ ప్రోగ్రామ్‌ ఇది. 
బట్‌ ఔట్‌ : సిగిరెట్‌ వదిలేయాలనే గోల్‌ మీద ఎక్కువ దృష్టికేంద్రీకరించిందీ యాప్‌. ఆ క్రమంలో మీ ప్రోగ్రెస్‌ కూడా తెలుపుతుంది. 
క్రావింగ్‌ టు క్విట్‌ : క్రావింగ్‌ టు క్విట్‌ అనేది 21 రోజుల ప్రోగ్రామ్‌. యేల్‌ యూనివర్సిటీ అధ్యయనం అధ్యయనం ఆధారంగా రూపొందించిన యాప్‌. ఖర్చుతో కూడుకున్నది కూడా ఇది, 
గెట్‌ రిచ్‌ ఆర్‌ డై స్మోకింగ్‌ : పేరుకు తగ్గట్లే సిగిరెట్‌ కాల్చడం వల్ల ఎంత డబ్బు వేస్ట్‌ చేస్తున్నది తెలుపడంతో పాటుగా మీరు సిగిరెట్‌ వదిలేయాలనుకున్న తర్వాత మీ ప్రోగ్రెస్‌ కూడా చూపుతుంది. 
క్విట్‌ : మీరు గేమ్స్‌ ఇష్టపడితే.. మీరు ఇష్టపడేది క్విట్‌ (జుఠీజ్టీ). సిగిరెట్‌ తాగడాన్ని ఏ విధంగా అయితే మీరు వదలాలనుకుంటారో.. అదే రీతిలో గేమే డిజైనర్లు దీన్ని డిజైన్‌ చేశారు. 60 లెవల్స్‌ ఉంటాయి అన్‌లాక్‌ చేయడానికి ! 
క్విట్‌ స్మోకింగ్‌ సెస్సేషన్‌ నేషన్‌ : మీ లక్ష్యంలో మీరు డిసా్ట్రక్ట్‌ అవుతున్నామనుకుంటే ఇది హెల్ప్‌ చేస్తుంది. 
క్విట్‌ నౌ : మీరు ఎందుకు ప్రయత్నిస్తున్నారో తెలుపడమే కాదు.. వర్ట్యువల్‌ బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తుంది.బి