సిద్దిపేటలో వైద్య కాలేజీ

ప్రసూతి, వైద్యం, అన్ని వసతులూ ఇక్కడే: హరీశ్‌
ఆస్పత్రి నిర్వహణపై ఆగ్రహం.. ఫార్మసిస్టుపై వేటు
 
సిద్దిపేట, ఆంధ్రజ్యోతి ప్రతినిధి: సిద్దిపేటలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో 400 పడకలు ఏర్పాటు చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రి కోసం ఆలిండియా మెడికల్‌ కౌన్సిల్‌ బృందం వచ్చే నెల ఇక్కడ పర్యటిస్తుందన్నారు. ఆగస్టు 15 లోపు 300 పడకల ఆస్పత్రిని ప్రారంభించేందుకు పనులు శరవేగంగా చేస్తున్నామన్నారు. తల్లీపిల్లలకు ఒకే చోట వైద్యం అందించేలా ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. మందులను రోగులకు ఇవ్వకుండా కాలం చెల్లినా స్టోర్‌ రూంల్లో దాచుకున్న ఫార్మసిస్టు బుచ్చిరాములును సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు.
 
పానీపూరి తిందాం రామలింగన్నా..
సిద్దిపేట పత్తి మార్కెట్‌లోని టెట్‌ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన తర్వాత మెయిన్‌ రోడ్డుపైకి వచ్చిన మంత్రి హరీశ్‌రావుకు గప్‌చుప్‌ బండ్లు కనిపించగానే నోరూరింది. గప్‌చు్‌పలు తిందామా రామలింగన్నా అంటూ తన కాన్వాయ్‌ను ఆపించిన మంత్రి తోపుడు బండిపై గప్‌చుప్‌లను ఎమ్మెల్యే రామలింగారెడ్డితో కలిసి తింటూ బాగున్నాయని మెచ్చుకున్నారు.