డెంగ్యూ రోగులకు జికా సోకితే ప్రమాదమే!

వాషింగ్టన్‌, జూలై 16: గతంలో డెంగ్యూ బారిన పడిన వారికి జికా వైరస్‌ సోకితే ఆరోగ్య పరిస్థితి ఊహించనంత దారుణంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిం చారు. చికిత్స చేసినా అదుపులోకి తీసుకురావటం చాలా కష్టమని, వ్యాధిగ్రస్తులు చావు అంచుల్లోకి మళ్లాల్సిందేనని బ్రెజిల్‌లోని సావో జోస్‌ డో రియో ప్రెటో మెడికల్‌ స్కూల్‌ పరిశోధకులు తెలిపారు. తాము 65 మంది రోగుల రక్త నమూనాలు సేకరించి డెంగ్యూ, జికా ప్రభావాన్ని పరీక్షించామని వివరించారు.