వ్యాధినిరోధక శక్తి పెంచే ‘పసుపు మాత్ర’

01-10-2019: ఏదైనా గాయమైనప్పుడు, కాలినప్పుడు వెంటనే వాడదగిన సహజ ఔషధం పసుపు అని మనందరికీ తెలుసు. అందులో ఉండే ‘కుర్క్యూమిన్‌’ అనే పదార్థంలోని యాంటీ ఆక్సిడెంట్ల వల్లే పసుపు ఒక ఔషధిగా పనిచేస్తుంటుంది. హృద్రోగాలు, మధుమేహానికీ బలమైన నిరోధకంగా పనిచేయగలగడం దీని ప్రత్యేకత. ఇటువంటి ఎన్నో ఆయుర్వేద గుణాలున్న పసుపును ‘స్నెక్‌ 30’ మాత్రల రూపంలో అందుబాటులోకి తెచ్చినట్లు స్నెక్‌30 వ్యవస్థాపకుడు డాక్టర్‌ సౌరభ్‌ అరోరా ప్రకటించారు. ఆహారం ద్వారా మన శరీరానికి అవసరమైన దానిలో 5శాతమే కు ర్క్యూమిన్‌ అందుతుందని.. మిగిలిన లోటును ఈ పసుపు మాత్ర భర్తీ చేస్తుందన్నారు. ఎక్కువ మోతాదు లో తీసుకున్నా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు ఉండవన్నారు.