గుడ్డులో ఏది మేలు?

13-11-2017: గుడ్డు మొత్తం తినాలని కొందరంటారు. లేదు...పసుపు వదిలేసి తెలుపే తినటం ఆరోగ్యకరమని ఇంకొందరంటారు. ఇంతకీ ఏది నిజం? ఈ విషయం తెలుసుకోవాలంటే ముందు గుడ్డులో ఉండే పోషకాల మీద ఓ లుక్కేయాలి.

 
మొత్తం గుడ్డు తెల్ల సొన
మాంసకృత్తులు - 28 గ్రాములు      మాంసకృత్తులు - 28 గ్రా.
పిండిపదార్థాలు - 2 గ్రాములు        పిండిపదార్థాలు - 2 గ్రా.
కొవ్వు - 21 గ్రా.                            కొవ్వు - 0
క్యాలరీలు - 137                          క్యాలరీలు - 312
 
తెల్లసొనతో పోల్చితే పూర్తి గుడ్డులో కొవ్వు పదార్థాలు అధికం. తెల్ల సొనలో పూర్తి ప్రొటీన్లు ఉంటే పచ్చ సొనతోపాటు కలిపి తింటే ప్రొటీన్లతోపాటు అదనంగా కొవ్వులూ అందుతాయి. కాబట్టి కేవలం ప్రొటీన్లే కావాలనుకునే వాళ్లు పచ్చసొన వదిలేసి తెల్లసొననే ఎంచుకోవాలి. హృద్రోగులు, కాలేయ సంబంధ సమస్యలున్నవాళ్లు..కేవలం తెల్ల సొననే తినాలి. కొవ్వు అవసరం ఎక్కువగా ఉండే పిల్లలు, యుక్త వయస్కులు పూర్తి గుడ్డును నిరభ్యంతరంగా తినొచ్చు.