ఆరోగ్యకరమైన డైట్‌తో శరీరంలో నీటినిల్వలు

12-09-2018: సరైన పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఊబకాయం, మధుమేహంతో పాటు ఇతరత్రా అనారోగ్య సమస్యలు దరిచేరకుండా తోడ్పడుతుంది. అయితే, ఆరోగ్యకరమైన డైట్‌తో శరీరంలో నీటి నిల్వలు పెద్దగా తగ్గవని తాజా అధ్యయనంలో తేలింది. మాంసాహార డైట్‌ పాటించేవారిలో బయట నుంచి నీరు తీసుకునే అవసరం 11 నుంచి 33 శాతం తగ్గింది. అదే శాకాహారం మాత్రమే తినేవారిలో 35 నుంచి 55 శాతం నీరు తక్కువగా అవసరం పడుతుందని తేలింది. ఫ్రాన్స్‌, యూకే, జర్మనీలోని 43వేల ప్రాంతాల్లోని ప్రజల ఆహారపు అలవాట్లను విశ్లేషించిన యూరోపియన్‌ కమిషన్‌ జాయింట్‌ రీసెర్చ్‌ సెంటర్‌(జేఆర్సీ) పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు.