ఈ ఆసుపత్రిలో ప్రతీరోజూ కవలల జననం

పెషావర్, 13-06-2018: ప్రతీ తల్లిదండ్రులూ తమ ఇల్లు చిన్నారులతో కళకళలాడాలని పరితపిస్తుంటారు. ఇలాంటి సమయంలో కవలలు జన్మిస్తే వారి ఆనందానికి హద్దూపద్దూ ఉండదు. అయితే కవలలు జన్మించడం అనేది అందరి విషయంనూ సాధ్యంకాదు. కాగా ఆ ఆసుపత్రిలో చేరిన ప్రతీ గర్భిణీ కవలలకు జన్మనిస్తోంది. ఇది వినడానికి వింతగా ఉన్నప్పటికీ. ఇది నిజం. పాకిస్థాన్‌లోని పెషావర్ పట్టణంలోని ఖైబర్ పఖ్తుంఖ్వా ఆసుపత్రిలో ప్రతీరోజూ చాలామంది కవలలు జన్మిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో ఈ ఏదాడి వెయ్యిమంది కవలలు జన్మించారు. అలాగే గత ఏడాది ఈ ఆసుపత్రిలో 1165 మంది కవలలు జన్మించారు.