జ్యోతిష్కుడితో రోగులకు చికిత్స

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాస్పత్రుల్లో కొత్త విధానం


భోపాల్‌, జూలై 16: అనారోగ్యంతో బాధపడుతున్నారా..? ఏదైనా రోగం వచ్చిందా..? అయితే జ్యోతిష్కుడి వైద్యంతో నయం చేసుకోండి. అవును ఇది నిజమే. జ్యోతిషంతోనే రోగాన్ని నయం చేస్తానంటోంది మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని అవుట్‌ పేషెంట్‌ విభాగంలో సెప్టెంబర్‌ నుంచి జ్యోతిష్కులు, సోది చెప్పే వాళ్లతోనూ వైద్యం చేయించాలని ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆదేశించారు. భోపాల్‌లోని మహారాశి పతంజలి సంస్కృత్‌ సంస్థాన్‌ (ఎంపీఎ్‌సఎస్‌) నుంచి జ్యోతిషంలో పట్టా పుచ్చుకున్న వారికే అక్కడ ఉద్యోగాలిస్తారు. జ్యోతిష్కులు, వాస్తు నిపుణులు, హస్తసాముద్రికులు, వైదిక కర్మకాండలు చేసేవాళ్లు పేషెంట్ల జాతకాన్ని, జీవిత కాలాన్ని తెలుపుతారు.