పిల్లలు కావాలంటే మగాళ్లు మద్యం మానేయాలి

04-10-2019: తమకు పుట్టబోయే పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంతో ఉండాలంటే పురుషులు, తమ భార్యలు గర్భం ధరించడానికి 6 నెలలు ముందుగానే ఆల్కహాల్‌ తీసుకోవడం మానేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తద్వారా పిల్లల్లో పుట్టుకతో వచ్చే గుండె జబ్బులను నిరోధించవచ్చని చెప్తున్నారు. మహిళలు తమ గర్భధారణకు ఏడాది ముందు నుంచే ఆల్కహాల్‌ మానేయాలని తెలిపారు. ఆల్కహాల్‌ తీసుకొన్నవారి పిల్లల్లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం 42ు ఎక్కువని చెప్పారు. దాదాపు 30 ఏళ్ల డాటా ఆధారంగా, 3.40 లక్షల మందిపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.