చర్మం నిగనిగలాడాలంటే..

ఆంధ్రజ్యోతి, 17-02-2017: కొందరు అందంగా కనపడాలని బ్యూటీ క్రీమ్స్‌తో దోస్తీ చేస్తుంటారు. రకరకాల స్టయిల్స్‌లో మేకప్‌ వేసుకుంటారు. అయితే నిజంగా అందమైన చర్మం ఉండాలంటే ఈ ప్రయాసలు పడనక్కర్లేదంటున్నారు నిపుణులు. చర్మం నిగారించాలంటే సహజమైన కొన్ని టిప్స్‌ పాటించాల్సిందేనట.కొందరు అందంగా కనపడాలని బ్యూటీ క్రీమ్స్‌తో దోస్తీ చేస్తుంటారు. రకరకాల స్టయిల్స్‌లో మేకప్‌ వేసుకుంటారు. అయితే నిజంగా అందమైన చర్మం ఉండాలంటే ఈ ప్రయాసలు పడనక్కర్లేదంటున్నారు నిపుణులు. చర్మం నిగారించాలంటే సహజమైన కొన్ని టిప్స్‌ పాటించాల్సిందేనట. 

 

అందమైన చర్మం ఉండాలని ఆరాటపడితే సరిపోదు. కొన్ని అలవాట్లు చేసుకోవాలంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచాక పరగడుపున క్యారెట్‌, దానిమ్మ జ్యూస్‌ తాగాలి. ముఖ్యంగా ప్రతిరోజూ తప్పనిసరిగా పది నుంచి పన్నెండు గ్లాసుల మంచినీళ్లు తాగాలి.

తాజా కూరగాయలు, పండ్లు తినాలి. ముఖానికి క్రీమ్‌ ప్యాక్స్‌ కాకుండా క్యారెట్‌, నారింజ, బొప్పాయి.. లాంటి ఫేస్‌ప్యాక్స్‌ వేసుకోవాలి. దీనివల్ల ముఖంలో కాంతి వస్తుంది.

ముఖంపై ఉండే మచ్చలు, నొప్పి కలిగించే మొటిమల వంటివాటిని గిల్లకూడదు. ముఖ్యంగా సహజమైన ఫేస్‌ప్యాక్స్‌ వేసుకునే ముందు ముఖాన్ని చల్లటి నీళ్లతో కడగాలి లేదా ఐస్‌క్యూబ్స్‌తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే స్కిన్‌ టోన్‌ అవుతుంది.

ఉదయాన్నే అల్లం, గ్రీన్‌టీల్లాంటివి తాగాలి. టీ తాగే అలవాటు లేకుంటే నిమ్మరసం తాగినా ఓకే.

ఉదయం ఎండలో కాసేపు ఉండాలి. కానీ.. మిట్టమధ్యాహ్నం ఎండ చర్మం మీద పడటం అంతమంచిది కాదు. ఈ ఎండ చర్మాన్ని కాంతివిహీనం చేస్తుందని తెలుసుకోవాలి.