తెల్ల జుట్టు రావడానికి కారణం ఇదే..

చిన్న వయసులోనే తెల్లజుట్టు, బట్టతల
కాలుష్యం, ఒత్తిడి కారణం అంటున్న నిపుణులు
పోషకాహారం లోపం మరో కారణం
చిన్న చిన్న జాగ్రత్తలతో సమస్యకు చెక్‌

గుంటూరు, 08-09-2018: ముఖారవిందానికి కురుల అందం అదనపు ఆకర్షణ. స్త్రీ, పురుషుల అందాన్ని ద్విగుణీకృతం చేయడంలో జుట్టుది ప్రధానపాత్ర. ఎంతటి అందానైనా బట్టతల, తెల్ల జుట్టు దెబ్బతీస్తాయి. చిన్నవయసులోనే జట్టు తెల్లబడినా, బట్టతల వెక్కిరిస్తున్నా నలుగురిలో తిరగాలంటే నామోషిగా భావిస్తోంది ఈ తరం యువత. కాలుష్యం, ఒత్తిడి, ఇతరత్రా సమస్యలతో ఇప్పుడీ రెండు సమస్యలు సర్వసాధారణం మయ్యాయి. గడచిన పదేళ్లలో జుట్టు రాలే సమస్య 80శాతం పెరిగినట్లు పలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బట్టతల, తెల్ల జుట్టుకు కారణాలు, పరిష్కారాలపై నిపుణుల సూచనలు ఇలా ఉన్నాయి..

 
కారణాలు అనేకం..
తల స్నానానికి ఏ షాంపూ దొరికితే దాన్నే వినియోగించడం నష్టదాయకం. షాంపూల్లో ఉండే సోడియం హైడ్రాక్సీ వెంట్రుకలను తెల్లగా చేయడంతో పాటు జుట్టును పొరిబార్చి రాలిపోయేలా చేస్తుంది. 
అతి చల్లని నీటితో తలస్నానం చేయకూడదు.
హార్మోన్ల అసమతౌల్యం వల్ల జుట్ట రాలడం, తెల్లబడే అవకాశం ఉంది.
జంక్‌ఫుడ్‌ తీసుకోవడం చాలా సమస్య ఇందులో వినియోగించే కొన్ని రసాయనాలు జుట్టుపై ప్రభావం చూపుతాయి.
సమయానికి భోజనం, నిద్ర లేకపోవడం, ఒత్తిడితో కూడిన ఉద్యోగం వల్ల జుట్టు రాలుతుంది.
శరీరానికి అవసరమైన విటమిన్స్‌ లోపమున్నా ఈ రెండు సమస్యలు కనిపిస్తాయి. ప్రధానంగా వెంట్రుకలు బలంగా ఉండేలా మెగ్నీషియం, కాల్షియం, ఐరన్‌ లోపం వల్లే ఎక్కవ మంది ఈ సమస్య బారిన పడుతున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
శరీరానికి పొషక పదార్ధాలతో కూడిన సమతుల ఆహారం అందించడం ద్వారా చాలావరకు సమస్య నుంచి బయటపడవచ్చు. తిండి, నిద్ర సక్రమంగా ఉండాలి.
ముఖ్యంగా ఆకుకూరలు, మినరల్స్‌, విటమిన్స్‌ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం ఉండే ఆహారం తీసుకుంటే మంచిది.
వారంలో కనీసం రెండుసార్లు తలకు ఆయిల్‌ పంట్టించాలి. కొబ్బరి నూనె రాస్తే మంచిది. కొన్ని రకాల ఆయిల్స్‌లోని కెమికల్స్‌ జుట్టును బలహీన పరుస్తాయి. వాటి జోలికి వెళ్లకూడదు.
గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. స్నానం అనంతరం జుట్టును తుడిచేటప్పుడు సున్నితంగా తుడవాలి.