అత్యంత దివ్యమైన ఔషధం...దానిమ్మ

05-06-2019: ఎరుపు రంగులో చూడగానే కంటికి ఇంపుగా కనిపించే దానిమ్మ పండ్లలో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. కాబట్టి దానిమ్మ పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల లాభాలెన్నో. దానిమ్మలో విటమిన్‌ ఎ, సి, ఇ, బి5, ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి అల్జీమర్స్‌, బ్రెస్ట్‌, చర్మ కేన్సర్‌లు రాకుండా అడ్డుకుంటాయి. అలాగే దానిమ్మలో ఉండే యాస్పిరిన్‌ గుణాలు రక్తసరఫరాను వేగవంతం చేయడంలో మెరుగ్గా పనిచేస్తాయి. పావుకప్పు దానిమ్మ రసం రోజూ తాగితే గుండెసంబంధిత వ్యాధులు దరిచేరవు. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గర్భస్థ శిశువుల పెరుగుదలకు అవసరమైన ఫోలిక్‌ యాసిడ్‌ ఈ పండులో పుష్కలంగా ఉంది. యాంటీ బాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు నోటిపూతనుంచి ఉపశమనం కలిగిస్తాయి. అల్సర్లను నివారిస్తాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్న దానిమ్మ పండును రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే ఎంతో మేలు.