విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ

హైదరాబాద్‌, రంగారెడ్డిల్లో 500 దాటిన కేసులు 
 
హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రభావం రోజురోజుకూ విజృంభిస్తోం ది. గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 521 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్లు ప్రభుత్వ పరీక్షల్లో తేలింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 17 మంది మృతి చెందారు. అనధికారికంగా మృతులు, వ్యాధి సోకిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఒకరి నుంచి మరొకరికి సోకే లక్షణం ఉన్న ఈ వ్యాధి ప్రభావం హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లో 218, రంగారెడ్డి జిల్లాలో 231 స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 21, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 12 చొప్పున కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఐదుగురు చొప్పు న మృతి చెందారు. ఎక్కువ జనాభా ఉన్న పట్టణ ప్రాం తాల్లో వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం చలి తగ్గి వేడి వాతావరణం పెరుగుతున్నా వ్యాధి మాత్రం నియంత్రణలోకి రాలేదు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం అన్ని ఆయుష్‌ సెంటర్ల నుంచి హోమియో మందులను సరఫరా చేస్తోంది. అయినా ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదు.